ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలేవీ అంచనాలను అందుకోలేదు. క్రిటిక్స్ కు నచ్చన 'సరైనోడు' తప్పిస్తే.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయని అనుకున్న 'సర్దార్' - 'బ్రహ్మోత్సవం' - 'కబాలి' వంటి పెద్ద సినిమాలన్నీ పల్టీలు కొట్టాయి. అందుకే ఇప్పుడు 'జనతా గ్యారేజ్' ఏం చేయబోతోందో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా షట్టర్ ను ఈరోజు దించేసినట్లే. మొత్తంగా ఫస్టు కాపీ రెడీ అయిపోయింది. ఈరోజు ఉదయం స్లాటులోనే సినిమాను సెన్సార్ కార్యక్రమాలకు పంపేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో సినిమాకు ఏ సర్టిఫికేట్ వస్తుందో తెలుస్తుంది. సమంత గ్లామర్.. సెకండాఫ్ లోని యాక్షన్ సీన్స్ లో ఉన్న వైలెన్స్.. మొత్తంగా సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ను తెప్పించే ఛాన్సుందని టాక్. ఈరోజు దింపిన షట్టర్.. మళ్లీ సెప్టెంబర్ 1న ధియేటర్లలోనే లేపేది. ఆ రోజు ప్రేక్షకమహానుభావులు సినిమాను వీక్షించి.. ఎన్ని మార్కులేస్తారు అన్నదానిబట్టే ''జనత గ్యారేజ్'' స్టోరేజీలో కౌంటింగ్ ఎలా ఉండబోయేదీ మనకు తెలుస్తుంది.
ఎన్టీఆర్ క్రేజు ఒకెత్తయితే.. మొదటి రెండు సినిమాలతోనూ రాకింగ్ సక్సెస్ అందుకున్న కొరటాల శివ మీద ఇప్పుడు భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే మోహన్ లాల్ ఉండటంతో ఆ క్యారెక్టర్ లోని కొత్తదనం ఏంటో ఆస్వాదించాలని ఆడియన్స్ కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అది సంగతి.