‘జనతా గ్యారేజ్’ మలయాళ వెర్షన్ విషయంలో ఆ మధ్య ఓ ప్రచారం జరిగింది. ఈ సినిమా మలయాళ హక్కుల్ని మోహన్ లాల్ పారితోషకం కింద ఆయనకు ఇచ్చేశారని.. మామూలుగా అయితే రూ.2 కోట్ల పారితోషకం తీసుకోవాల్సిన ఆయన ఈ సినిమా హక్కుల్ని రూ.5 కోట్లకు పైనే మారు బేరానికి అమ్ముకున్నారని చెప్పుకున్నారు. ఐతే అందులో వాస్తవమెంతో కానీ.. ప్రస్తుతం మలయాళంలో ‘జనతా గ్యారేజ్’ రిలీజవుతున్న తీరు చూస్తుంటే మాత్రం ఈ సినిమా రేంజి ఎక్కడికో వెళ్లిపోయేలా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. తక్కువలో తక్కువ రూ.15-20 కోట్ల మధ్య వసూళ్లు వచ్చే పరిస్థితి ఉంది.
‘జనతా గ్యారేజ్’ను ఓ తెలుగు సినిమా లాగా ప్రమోట్ చేయట్లేదు. రిలీజ్ చేయట్లేదు. పక్కా మలయాళం సినిమా అన్నట్లే ప్రచారం చేస్తున్నారు. మోహన్ లాల్ తోనే పోస్టర్లన్నీ నింపేసి.. ఆయన సినిమా అన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు. రెగ్యులర్ గా మోహన్ లాల్ సినిమాలు ఎలా రిలీజవుతాయో.. అదే స్థాయిలో భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు. మలయాళ వెర్షన్ లో లాల్ పాత్ర కూడా ఎక్కువగా ఉంటుందని.. క్లైమాక్స్ లో ఆయన డామినేషనే ఉంటుందని.. ఈ ఎపిసోడ్ వేరేగా తీశారని చెబుతున్నారు. కాబట్టి ఈ చిత్రానికి మలయాళ ప్రేక్షకులు బాగానే కనెక్టయ్యే అవకాశముంది. మలయాళ మార్కెట్ చిన్నదే అయినప్పటికీ.. మోహన్ లాల్ కు అక్కడుండే క్రేజే వేరు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’ సినిమా మలయాళ సినీ చరిత్రలోనే తొలిసారి రూ.50 కోట్ల క్లబ్బులో చేరిన సినిమా అయింది. ఆ లెక్కన చూసుకుంటే ‘జనతా గ్యారేజ్’కు హిట్ టాక్ వస్తే సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో అంచనా వేయొచ్చు. మరి ఈ ఆదాయమంతా ఎవరి ఖాతాలోకి వెళ్తుందో.. ‘జనతా గ్యారేజ్’ నిర్మాతలు.. లాల్ మధ్య ఎలాంటి ఒప్పందముందో?