ఆ 7 కోట్లు.. మోహన్‌ లాల్ ఎఫెక్ట్

Update: 2016-08-01 11:30 GMT
ఒక సినిమాలో పరబాషా నటులు ఎందుకు అంటూ చాలామందికి చాలా సందేహాలు ఉండొచ్చు. నిజానికి వెండితెరకు నిండుదనం తీసుకురావడానికే అనే మాట కంటే.. అసలు సినిమా బిజినెస్ అవకాశాలను పెంచడానికి ఈ పరబాషా నటులు కావల్సిందే. ఇక వారి మథర్ టంగ్ లో సినిమాను రిలీజ్ చేయాలంటే.. అప్పుడు ఎంతో ప్లస్ అవుతుంది. ఇప్పుడు ''జనతా గ్యారేజ్‌'' ను చూస్తే ఆ విషయం ఈజీగా అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు కేరళలో మన తెలుగు సీమ నుండి హీరోలుగా వెలుగొందింది అంటే.. కేవలం అల్లు అర్జున్ ఒక్కడే అని చెప్పాలి. అతగాడి ''సరైనోడు'' సినిమాను అక్కడ ''యోధావు'' అని రిలీజ్ చేస్తే.. 7 కోట్ల ధియేట్రికల్ కలక్షన్ వచ్చింది. అంటే నిర్మాత చేతికి వచ్చింది కేవలం 3.4+ కోట్ల షేర్ అనమాట. అయితే ఇప్పుడు ''జనతా గ్యారేజ్'' సినిమాకు ఇలాంటి లెక్కలతో సంబంధం లేకుండా.. ఏకంగా 7 కోట్లు పెట్టి రైట్స్ కొన్నారట. అంటే షుమారు 14 కోట్లు వస్తే కాని సినిమాపై పెట్టిన ఇన్వెస్టుమెంటును అక్కడి పంపిణీదారులు రికవర్ చేసుకోలేరు. అక్కడ అసలు ఇమేజ్ అనేదే లేని జూ.ఎన్టీఆర్ కు ఇంతెందుకు ఇచ్చారో తెలుసా?

మోహన్‌ లాల్‌ అంటే అక్కడ సూపర్ స్టార్. అయన ఉన్నాడు కాబట్టి ధియేటర్లకు బాగా జనాలు రావడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మన దగ్గర బాలయ్య సినిమా - సూర్య సినిమా విడుదలయ్యాయ్ అనుకోండి.. ఆటోమ్యాటిక్ గా బాలయ్య సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అక్కడ కూడా అంతే.. మోహన్ లాల్ క్రేజ్ అలాంటిది. ఈ సినిమాతో కనుక ఒకవేళ జూనియర్ బాగా ఇంప్రెస్ చేస్తే.. అప్పుడు మనోడికి అక్కడ ఇండివిడ్యువల్ మార్కెట్ ఏర్పడుతుంది.

Tags:    

Similar News