సోదరి రియా కపూర్ (అనీల్ కపూర్ కుమార్తె) పెళ్లి వేడుకలో జాన్వీ కపూర్ ఎంట్రీ ఓ రేంజులో చూపరులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మెరుపులు మిరుమిట్ల డిజైనర్ డ్రెస్ లో జాన్వీ అస్సలు కళ్లు తిప్పుకోనివ్వలేదు. వివాహానంతరం రిసెప్షన్ లో మరో సరికొత్త లుక్ తో తళుక్కుమంది. ఆరోజు షో స్టాపర్ గా జాన్వీ పేరు మార్మోగింది.
తాజాగా జాన్వీ ఇన్ స్టాలో ఈ పెళ్లి రిసెప్షన్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేయగా వైరల్ గా మారాయి. అందులో జాన్వీతో పాటు ఉన్న ఆ అందమైన కిలాడీ గాళ్ ఎవరు? అంటూ ఆరాలు మొదలయ్యాయి.
ఈ బ్యూటీ తన కొలీగ్. జాన్వీకి బెస్ట్ ఫ్రెండ్ తనీషా సంతోషి... రియా కపూర్ - కరణ్ బూలానీ వివాహ వేడుకల అనంతర పార్టీలో ఫోటోలు దిగారిలా. ఎందుకంటే ఈ విందుకు జాన్వీ అదే నీలిరంగు దుస్తుల్ని ధరించి కనిపించింది కాబట్టి ఎవరికి వారు వెన్యూని గెస్ చేస్తున్నారు.
జాన్వీ కపూర్ తన సోదరి రియా బిగ్ డే ని మరింత వర్ణరంజితంగా మార్చింది అంటే అతిశయోక్తి కాదు. తనదైన అసాధారణ లుక్ లో తెల్లని ప్యాంటును ధరించి దానికి కాంబినేషన్ గా స్ట్రాప్ లెస్ సీక్విన్ బ్లూ క్రాప్ టాప్ తో కనిపించింది. వెండి- నీలం నెక్లెస్ లు -సొగసైన చెవిపోగులు ఈ చిక్ లుక్ ని పీక్స్ కి చేర్చాయి. తాజాగా రివీలైన ఫోటోలలో జాన్హీ- తానిషాతో కలిసి చిరునవ్వులు చిందిస్తోంది. బ్లూ థై స్లిట్ డ్రెస్ లో జాన్వీ తళుకుబెళుకులను మించి తానీషా గుండెలు తీసిన బంటునే తలపించింది అంటూ యూత్ ఒకటే కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. స్టన్నింగ్ బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ తో ఈ స్నేహితురాళ్లు పార్టీకే ప్రత్యేక శోభ తెచ్చారు సుమీ అంటూ చూపరులు పొగిడేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 2021 మార్చిలో ఆమె చిత్రం రూహి విడుదలైంది. దీనికి అభిమానుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్రలో నటించారు. జాన్వీ కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ మిలి కోసం షూటింగ్ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ చిత్రం మలయాళ చిత్రం - హెలెన్ కి హిందీ రీమేక్. మలయాళ వెర్షన్ కి చిత్రానికి దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. హెలెన్ లో అన్నా బెన్ నటించింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. కరణ్ జోహార్ దోస్తానా 2లోనూ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తనీషా కూడా పలు చిత్రాలతో బిజీగా ఉంది. అయితే తను కథానాయికగా కాదు. నిర్మాతగా ప్రొడక్షన్ డిజైనర్ గా స్క్రిప్టు రచయితగా ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న బ్యూటీ ఈమె.