జాన్వి ఇంతలోనే ఎంత మార్పు..!

Update: 2022-11-06 02:30 GMT
బాలీవుడ్ లో ప్రస్తుతం తన గ్లామర్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న స్టార్ తనయ జాన్వి కపూర్ కమర్షియల్ సక్సెస్ లేకపోయినా సరే వెనకాల బోనీ కపూర్ లాంటి గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి కెరియర్ స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఇక కెరియర్ లో ఫస్ట్ టైం తన తండ్రి ప్రొడక్షన్ లో సినిమా చేసింది జాన్వి కపూర్. మిలి సినిమాని బోనీ కపూర్ నిర్మించారు. అఫ్కోర్స్ కూతురు కోసమే ఎంత బడ్జెట్ అయినా లెక్క చేయకుండా ఖర్చు పెట్టారని టాక్. మళయాళంలో సూపర్ హిట్టైన హెలెన్ రీమేక్ గా మిలి వచ్చింది. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్న జాన్వి కపూర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేయడంతో ఇక్కడ కూడా వచ్చి ప్రమోషన్స్ చేసింది. హైదరాబాద్ లో జాన్వి మిలి ప్రెస్ మీట్ లో పాల్గొన్నది. ఆ టైం లో టాలీవుడ్ పై తన ఆసక్తి కనబరచింది అమ్మడు.

అంతేకాదు ఎన్.టి.ఆర్ తో తను నటించాలని ఉందన్నట్టు చెప్పుకొచ్చింది. ఎన్.టి.ఆర్ గొప్ప నటుడని ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అని మనసులో మాట చెప్పేసింది జాన్వి. అయితే ఇన్నాళ్లు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో తను నటించేందుకు రెడీ అని చెప్పిన జాన్వి సడెన్ గా ఇప్పుడు తారక్ పేరు చెప్పడంపై కారణాలు విశ్లేషిస్తున్నారు.

కాఫీ విత్ కరణ్ షోలో కూడా జాన్వి కపూర్ రౌడీ బోయ్ తో రొమాన్స్ కి రెడీ అని డైరెక్ట్ గా చెప్పేసింది. అలాంటిది హైదరాబాద్ లో కనీసం విజయ్ దేవరకొండ పేరు ఎత్తలేదు. దీనికి కారణం విజయ్ లాస్ట్ మూవీ లైగర్ ఫ్లాప్ అవడమే అని అంటున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అంటూ ఓ రేంజ్ లో హడావిడి చేసిన లైగర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ ఇంప్యాక్ట్ వల్లే జాన్వి ఇక్కడకు వచ్చినా విజయ్ పేరు ప్రస్థావించలేదని అంటున్నారు. కారణం ఏదైనా సరే విజయ్ పేరుని జాన్వి ప్రస్థావించకపోవడం చూసి అమ్మో జాన్విలో ఇంతలోనే ఎంత మార్పు అనుకుంటున్నారు ఆడియన్స్.

ఇక కాఫీ విత్ కరణ్ షోలో తమ హీరో పేరు చెప్పి హైదరాబాద్ ప్రెస్ మీట్ లో కనీసం విజయ్ పేరు చెప్పకపోవడంపై రౌడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అంతేకాదు జాన్వి కేవలం సక్సెస్ ఉన్న హీరోలతోనే నటిస్తుందని.. ఆమెలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ తో మాత్రం నటించాలని గట్టిగా ప్రయత్నిస్తున్న జాన్వి చూస్తుంటే కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో అమ్మడు సెలెక్ట్ అయ్యేలా ఉంది.

ఒకవేళ అదే నిజమైతే తెలుగు తెర మీద జాన్వి అందాలను చూసేందుకు తెలుగు ఆడియన్స్ రెడీగా ఉన్నారు. శ్రీదేవి తనయ తెలుగు తెర మీద అద్భుతాలు సృష్టించాలని చూస్తుంది. మరి అమ్మడి డ్రీమ్స్ ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News