జాన్వీ ఫొటో షూట్‌.. షాక్ లో ఫ్యాన్స్

Update: 2020-03-03 05:47 GMT
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కెరీర్ ఇప్ప‌టికే రెండేళ్ల‌కు చేరువైంది. దఢక్‌ చిత్రంతో కథానాయికగా ప‌రిచ‌య‌మైంది. తొలి ప్ర‌య‌త్నంలోనే లేగ క‌ళ్ల‌తో అల్ల‌రి న‌వ్వుతో మాయ చేసింది. నటన పరంగా కొన్ని విమర్శలు వచ్చినా శ్రీదేవి తనయగా వ‌న్ ఫిలిం కిడ్ అంటూ మిన‌హాయింపులిచ్చారు క్రిటిక్స్. దీంతో బాలీవుడ్ లో తనకి డిమాండ్‌ ఏర్పడింది. తన మెంటర్‌ కరణ్‌ జోహార్‌ ఆమెకి వరుసగా భారీ అవకాశాలు కల్పిస్తూ షార్ట్ టైమ్ లో స్టార్‌ హీరోయిన్ ని చేసే బాధ్యతలు తీసుకున్నారు.

హోదాకి త‌గ్గ‌ట్టే.. జాన్వీ నిరంతరం ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. నిరంత‌ర‌ పార్టీల్లో ఫ్యాష‌న్ ఈవెంట్ల‌లో కనిపిస్తూ సెన్సేష‌న్ గా మారుతుంటుంది. అదే సమయంలో గ్లామర్‌ సైడ్‌ కూడా తనని ఎక్స్ పోజ్‌ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆమె గ్రాజియా అనే సెలబ్రిటీ మ్యాగజైన్‌ కోసం పోజులిచ్చింది. కాకపోతే అందాల ఆర‌బోత‌తో ప‌ని లేకుండా తన ఇన్నోసెంట్‌.. గుడ్‌ లుకింగ్ స్టైల్ తో ఆకట్టుకుంది. జ‌నరల్‌గా మేగజైన్ లకు కథానాయిక‌లు అందాల ప్రదర్శన చేస్తుంటారు. కానీ జాన్వీ షూట్ ఆర‌బోత‌ను కోరుకునే ఫ్యాన్స్ కి షాక్ అనే చెప్పాలి. ఆర‌బోత‌కు భిన్నంగా ప్రకృతిలో కలిసిపోయే కాస్ట్యూమ్స్ ధరించి సినీ అభిమానులనే కాదు.. జనరల్‌ ఆడియెన్ మనసులను దోచింద‌నే చెప్పొచ్చు. తాజా లుక్ లో చెట్టు కొమ్మల మధ్య స్టయిల్ గా ఓర చూపులు చూస్తూ జాన్వీ మైమరపిస్తుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకునే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం జాన్వీ ఇండియన్‌ లేడీ ఎయిర్ ఫోర్స్ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ `గుంజన్‌ సక్సేనా` చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. కెరీర్‌ ప్రారంభంలోనే శక్తివంతమైన పాత్ర రావడం.. అది కూడా లేడీ ఓరియెంటెండ్‌ చిత్రం కావడం విశేషంగానే చెప్పుకోవాలి. ఇది త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు `దోస్తానా2`- అలాగే `రూహి అఫ్జానా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ.
Tags:    

Similar News