జాన్వీ 100కోట్లు తెస్తుందా?

Update: 2018-07-22 07:01 GMT
జాన్వీ క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసిన ధ‌డ‌క్ రిపోర్ట్ ఏంటి?  బాక్సాఫీస్ వ‌ద్ద జాన్వీ మ్యాజిక్ ప‌ని చేస్తోందా లేదా? అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి దివికేగాక‌, న‌ట‌వార‌సురాలు న‌టించిన తొలి సినిమా ఆశించిన ఫ‌లితాన్ని ఇచ్చిందా.. లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఇది.

జాన్వీ క‌థానాయిక‌గా - ఇషాన్ ఖ‌త్త‌ర్ క‌థానాయ‌కుడిగా శ‌శాంక్ ఖైతాన్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన `ధ‌డ‌క్‌` తొలి రోజు మిక్స్‌ డ్ టాక్ తెచ్చుకుంది. జాన్వీ, ఇషాన్ న‌ట‌న‌కు వంద‌కు వంద మార్కులు వేసిన క్రిటిక్స్ సినిమా  మాత్రం యావ‌రేజ్ అని చెప్పారు. అయితే దాంతో సంబంధం లేకుండా జాన్వీ మాయాజాలం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ని చేస్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది. ధ‌డ‌క్ తొలిరోజు (శుక్ర‌వారం) సుమారు 9కోట్ల నెట్‌ వ‌సూలు చేస్తే, రెండో రోజు (శ‌నివారం) మ‌రింత మెరుగ్గా 11కోట్ల నెట్‌ మార్క్‌ని చేరుకుంది. అంటే ఇప్ప‌టికి రెండురోజుల‌కు కలిపి సుమారు 20కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లోనూ జాన్వీ పెర్ఫామెన్స్ వ‌ర్క‌వుటైంది. ఇక్క‌డ‌ మెట్రో న‌గ‌రాల్లో మ‌ల్టీప్టెక్సుల్లో ఆద‌ర‌ణ బావుంద‌ని తెలుస్తోంది. అయితే 4 కోట్ల బ‌డ్జెట్ తో తీసిన‌ సైరాట్ 100కోట్లు వ‌సూలు చేసింది. ధ‌డ‌క్‌ కి క‌ర‌ణ్ జోహార్‌ 70కోట్లు పెట్టాడు .. మ‌రి అలాంట‌ప్పుడు ధ‌డ‌క్ ఎంత వ‌సూలు చేయాలి? అన్న విశ్లేష‌ణ సాగుతోంది. ఇంత‌కీ జాన్వీ 100 కోట్లు తెస్తుందా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే జాన్వీ డెబ్యూ మాత్రం ఓపెనింగుల ప‌రంగా అద‌ర‌గొట్టింద‌ని చెప్పొచ్చు.


Tags:    

Similar News