అతిలోకసుందరి స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్థానం బాగానే సాగుతోంది. మొదటి సినిమా ధడ్కన్ మంచి పేరుతో వంద కోట్ల వసూళ్లు తేవడంతో డెబ్యూ సక్సెస్ పట్ల ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది. ఇప్పటికే నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న జాన్వీ కెరీర్ లో చాలా తొందరగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదే వెబ్ సిరీస్ లో నటించడం.
నెట్ ఫ్లిక్స్ చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఘోస్ట్ స్టోరీస్ లో జాన్వీ కపూర్ నటిస్తోంది. తానెంతగానో అభిమానించే జోయా అక్తర్ దర్శకురాలు కావడం వల్లే ఇది ఒప్పుకున్నానని ఆనందం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో జాన్వీ స్వయంగా వెల్లడించడంతో ఇది ప్రపంచానికి తెలిసింది. ఒకపక్క హీరోయిన్ గా కెరీర్ ని బిల్డ్ చేసుకోవాల్సిన టైంలో ఇలా వెబ్ సిరీస్ చేయడం ఏమిటన్న కామెంట్స్ ని జాన్వీ పట్టించుకోవడం లేదు
జాన్వీ చేస్తున్న సిరీస్ పేరు ఘోస్ట్ స్టోరీస్. అంటే దెయ్యాల కథలు. ఏదో సాఫ్ట్ జానర్ అయితే ఓకే కానీ మరీ ఇలా భూతాలు ఆత్మల స్టోరీలెందుకని అంటున్న వాళ్ళు లేకపోలేదు. నెట్ ఫ్లిక్స్ దీని కోసం భారీ బడ్జెట్ నే కేటాయిస్తోంది. సౌత్ లో జాన్వీ ఎంట్రీ ఇస్తాను అని చెప్పాలే కానీ చెక్కులు పట్టుకుని నిర్మాతలు రెడీగా ఉన్నారు. అలాంటిది పట్టుమని పది సినిమాలు చేయకుండా జాన్వీ ఇలా వెబ్ సిరీస్ చేయడం ఏమిటన్న వాళ్ళు లేకపోలేదు.
బాలీవుడ్లో ఇటీవలి కాలంలో హీరోయిన్లు సబ్జెక్ట్ నచ్చితే అది సినిమానా వెబ్ సిరీసా అని ఆలోచించడం లేదు. వెంటనే ఒప్పేసుకుంటున్నారు. కానీ జాన్వీ మాత్రం చాలా చిన్న వయసులోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యకరమే. జాన్వీ ప్రస్తుతం రూహ్ ఆఫ్జా - దోస్తానా 2 - తక్త్ - కార్గిల్ గర్ల్ సినిమాలతో యమా బిజీగా ఉంది. ఇంత టైట్ షెడ్యూల్ లోనూ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పడం విశేషమే.