ఫోటో స్టోరి: జిల్ల‌‌‌నే అందంతో క‌వ్విస్తున్న క‌పూర్ ఫ్యాష‌నిస్టా

Update: 2021-03-12 23:30 GMT
క‌పూర్ ఫ్యామిలీ నుంచి ఫ్యాష‌నిస్టా అంటే ఒక‌ప్పుడు సోన‌మ్ వైపే చూసేవారంతా. కానీ ఆనంద్ అహూజాని పెళ్లాడి వెళ్లిపోయాక‌.. ఆ లెగ‌సీని ముందుకు న‌డిస్తోందంటూ జాన్వీ క‌పూర్ ని పొగిడేయ‌డం మొద‌లెట్టారు. క‌పూర్ వంశ‌పు ఫ్యాష‌నిస్టాలు బాలీవుడ్ లో దివిటీల్లా వెలుగులు పంచుతున్నార‌నేది ఫ్యాష‌న్ ప్ర‌పంచం టాక్.

గ‌త కొంత‌కాలంగా జాన్వీ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై చెల‌రేగిపోతోంది. ఇటీవ‌ల రూహీ అఫ్జానా రిలీజ్ సంద‌ర్భంగా రోజుకో స్పెష‌ల్ ఫోటోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. అవ‌న్నీ వైర‌ల్ అయ్యాయి. తాజాగా జాన్వీ క‌పూర్ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. జాన్వీ ఈ డిజైన‌ర్ లుక్ లో కిల్ చేస్తోందంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అంత‌గా ఆ డ్రెస్ లో ఏం ఉంది? అంటే.. మామ్ శ్రీ‌దేవి ఎంపిక‌ల్ని త‌ల‌పిస్తోందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

జాన్వీ అంద‌చందాల్ని పాక్షికంగా ఎలివేట్ చేస్తున్న ఈ డిజైన‌ర్ వేర్ కి  స‌ముద్ర జీవ‌రాశులు ప‌క్షుల రూపం స్ఫూర్తి. జాన్వీ లో కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

జాన్వీ న‌టించిన‌ తాజా హర్రర్-కామెడీ రూహి అఫ్జానా థియేట‌ర్ల‌లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. తొలిరోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వసూళ్లు తెచ్చిన‌ట్లు తెలిసింది.  డే-వ‌న్ 3కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం మూడు రోజుల‌కు 10కోట్లు వ‌సూలు చేసే వీలుంద‌ని ట్రేడ్ చెబుతోంది. గత సంవత్సరం దేశవ్యాప్తంగా కరోనావైరస్ మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ తో థియేటర్లను మూసివేశాక ఇది హిందీ చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్.. ఈ చిత్రానికి హార్దిక్ మెహతా దర్శకత్వం వహించారు.
Tags:    

Similar News