నాలుక చాచి అమ్మోరులా ఏంటిది జాన్వీ?

Update: 2021-11-20 02:30 GMT
అమ్మోరు స్ఫుర‌ద్రూపం నేరుగా చూస్తే క‌లిగే ఫీలింగ్ ఎలా ఉన్నా.. అమ్మోరు ఉగ్ర‌రూపం దాల్చితే  ఎంత‌ భ‌యాన‌కంగా ఉంటుందో తెలిసిందే. నుదిటిన పెద్ద బొట్టు..పెద్ద కాటుక‌ క‌ళ్లు.. న‌ల్ల‌ని రూపంపై ఎర్ర‌ని నాలుక బ‌య‌ట‌కి చాచి భ‌య‌పెట్టేయ‌డం వంటివి అమ్మోరు సిగ్నేచ‌ర్ మార్క్. దేవ‌త‌ల నేప‌థ్యంలో సినిమాలు ఇదివ‌ర‌కూ తెలుగులో చాలానే వ‌చ్చాయి. ర‌మ్య‌కృష్ణ‌- సౌంద‌ర్య‌- అనుష్క లాంటి అగ్ర నాయిక‌లు అమ్మోరు గెట‌ప్పుల్లో మెప్పించారు.

తాజాగా అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్ అమ్మోరులానే హ‌డావుడి చేసే ప్ర‌య‌త్నం చేసింది. న‌డిరోడ్డుపై జీబ్రా క్రాసింగ్ వ‌ద్ద న‌డుచుకుంటూ వ‌స్తూ క‌ళ్లు పెద్ద‌వి చేసి..నాలుక‌ను అలా బ‌య‌ట‌కు తీసి స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించింది. అయితే ఈ బ్యూటీ కూడా అమ్మోరులా న‌టిస్తే త‌న‌కు యాప్ట్ అన్న‌ది నెటిజ‌నం ప‌సిగ‌ట్టి స‌ల‌హాలు ఇవ్వ‌డం మొద‌లెట్టారు.

పిక్క‌లపైకి లోదుస్తులు ధ‌రించిన జాన్వీ టూమ‌చ్ హాట్ గా క‌నిపించింది ఈ ఫోటోగ్రాఫ్ లో. కాలానుగుణంగా వింట‌ర్ కోట్ ని ధ‌రించింది. ఈ ఫోటోగ్రాఫ్ లో జాన్వీ థై అందాలు ప్ర‌త్యేకంగా ఎలివేట్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఇది ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. మ‌రి ఇలా కెమెరాకి ఫోజులిస్తే ఫాలోవ‌ర్స్ ఊరుకుంటారా?  వారంతా ఎందుక‌ని కామ్ గా ఉంటారు.. అంటూ త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇది అమ్మోరు లుక్ లా అనిపించ‌లేదు. ఓ దెయ్యంలా క‌నిపిస్తున్నావ్! అంటూ కామెంట్ చేసాడు. న‌డిరోడ్డు మీద ఈ వేషాలు ఏమిటా అని మ‌రికొంద‌రు మండిప‌డుతున్నారు.

ఇక జాన్వీ  సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో  `దోస్తానా-2`లో న‌టిస్తోంది. అదే బ్యాన‌ర్ లో మ‌రో రెండు చిత్రాలు క‌మిట్ అయింది. అలాగే జాన్వీ న‌టించిన `గుడ్ ల‌క్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.`మిలీ` అనే మ‌రో చిత్రంలో కూడా న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక ద‌క్షిణాదిన ఎంట్రీ ఇవ్వ‌డానికి జాన్వీ ఆస‌క్తిగానే ఉంది. కానీ స‌రైన ప్రాజెక్ట్  కోసం ఎదురుచూస్తోంది. ఆ ల‌క్కీ ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోవ‌డానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. త‌ల్లి త‌ర‌హాలోనే అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయాల‌ని ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.
Tags:    

Similar News