ఫోటో స్టోరీ : చిల‌క‌ ప‌చ్చ కోకలో జాన్వీ పెట్టించింది కేక‌!

Update: 2022-10-28 06:32 GMT
చిల‌క ప‌చ్చ కోక‌..పెట్టినాది కేక అంటూ బాల‌య్య‌..సిమ్రాన్ ఏ రేంజ్ లో ఆటాడుకున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌టి నుంచి మార్కెట్ లో  చిల‌క ప‌చ్చ‌కోక‌ల‌కు డిమాండ్ పెరిగిపోయింది. చిల‌క ప‌చ్చ కోక ఎక్క‌డ క‌నిపించినా బాల‌య్య‌..సిమ్రాన్ ట‌ఠ‌క్కున గుర్తొస్తారు. అంత‌గా ఆ పాట‌..ఆ కోక ప్రేక్ష‌కుల్లో నాటుకుపోయింది. తాజాగా మ‌రోసారి చిల‌క ప‌చ్చ కోక హైలైట్ చేసింది జాన్వీ క‌పూర్.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ చిల‌క‌ ప‌చ్చ కొక‌లో వ‌య్యారాలు ఒల‌క‌బోసింది. చిల‌క ప‌చ్చ‌కోక‌..మ్యాచింగ్ షోల్డెర్ లెస్ జాకెట్ ధ‌రించి అంద‌మే అసూయ‌ప‌డేలా చేసింది. అందమైన అమ్మాయి చీరందంలో ఇంకెంత అందంగా అకినిపిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ అందాన్ని వ‌ర్ణించాలంటే ర‌వివ‌ర్మ‌నే దిగిరావాలేమో అన్నంతంగా జాన్వీ చీరందంలో హైలైట్ అవుతోంది.

జాన్వీ చెవి బుట్ట‌లు అమ్మ‌డి ముఖానికి మ‌రింత అందాన్ని తీసుకొచ్చాయి. ప్ర‌స్తుతం ఈ మిర్ర‌ర్ ఫోజు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.  జాన్వీని చీరందంలో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వాళ్ల కామెంట్లు హ‌ద్దు అదుపులేదు. ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు గుప్పించి అభిమానం చాటుకుంటున్నారు. చీర‌లు ధ‌రించ‌డం జాన్వీకి కొత్తేం కాదు.

గ‌తంలో చాలాసార్లు చీరందంలో త‌ళుక్కున మెరిసింది. కానీ చీర ఎప్పుడు ధ‌రించినా స‌మ్ థింగ్ స్పెష‌ల్ ఉంటుంది. అందులోనూ  ఇలా చిల‌కాకుపచ్చ చీర‌లో క‌నువిందు చేయ‌డం ఇదే తొలిసారి. మ‌రి నెట్టింట హైలైట్ కాకుండా ఎలా ఉంటుంది.

జాన్వీ కెరీర్ సంగ‌తి చూస్తే అమ్మ‌డు  సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ఈ విష‌యం గురించి లీక్ ఇచ్చింది. దీంతో స‌రైన క‌థ‌..స్టార్ హీరో కుదిరితే ఎప్పుడైనా?  లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఇక తండ్రి బోణీ క‌పూర్ కూడా   త‌మిళ్ లో వ‌రుస‌గా  సినిమాలు నిర్మిస్తున్నారు. అక్క‌డ మార్కెట్ పై మంచి అవ‌గాహ‌న ఉంది.

ఈ నేప‌థ్యంలో జాన్వీ సౌత్ ఎంట్రీ కోలీవుడ్ లో ఉంటుంద‌ని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో  కరణ్ జోహార్ బ్యానర్లో 'దోస్తానా-2' లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. 'మిలీ' అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. 'మిస్ట‌ర్ ఆనంద్ - మ‌హి'..'బ‌వాల్' చిత్రాల్లోనూ న‌టిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News