స్టార్ కిడ్స్ సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. యువతరంలో ప్రతిసారీ చర్చకు తెర లేస్తుంటుంది. స్టార్ కిడ్స్ లవ్ లైఫ్ గురించి కహానీలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో అమితాబ్ మనవరాలైనా ఖాన్ ల త్రయం వారసులు అయినా.. లేదా కపూర్ డాటర్స్ అయినా మొత్తానికి ఎఫైర్ మ్యాటర్ అన్నివేళలా హాట్ టాపిక్ గానే మారుతోంది.
ఇక జాన్వీ కపూర్ .. అనన్య పాండే లాంటి నాయికలపైనా ఎఫైర్ కహానీలు నిరంతరం వింటున్నవే. వీళ్లంతా సహచరులతో సన్నిహితంగా మెలిగే క్రమంలో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. కోస్టార్ లతో ప్రేమాయణాలపైనా నిరంతరం చర్చ సాగుతూనే ఉంది.
తాజాగా జాన్వీ కపూర్ ఓ పార్టీలో ఓ అందమైన యువకుడితో చనువుగా మెలిగిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అతడు పార్టీ వేర్ లో ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నాడు. ఇదే ఫోటో సెషన్ లో తన స్నేహితురాళ్లు సారా అలీఖాన్... నైసా దేవగన్ వంటి వారితోను జాన్వీ ఫోటోలు దిగింది. కానీ ఆ అందమైన యువకుడితో దిగిన ఫోటోనే హైలైట్ అయ్యింది. ఇంతకీ అతడు ఎవరో జాన్వీ చెప్పనే లేదు. మిలీకి దివాళీ అంటూ సింపుల్ క్యాప్షన్ తో ఈ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవన్నీ వైరల్ గా మారాయి.
దోస్తానా నటుడితో ఎఫైర్...!
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ - బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ మధ్య ప్రేమాయణం ఇంకా కొనసాగుతుందా? లేక విడిపోయారా? .. అంటే దీనిపై ఇప్పటికీ క్లారిటీ దొరికలేదు. ఈ జోడీ కరణ్ జోహర్ నిర్మిస్తోన్న దోస్తానా-2 లో హీరో- హీరోయిన్లగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇరువురు ప్రేమలో పడ్డట్లు బాలీవుడ్ మీడియా వేడెక్కించింది. అయితే కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఉన్నట్లుండి కార్తిక్ ఆర్యన్ ని కరణ్ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. అప్పటికే పూర్తయిన షూట్ ని స్క్రాప్ లోకి తొసేసి మళ్లీ రీషూట్ కూడా చేసారు. అయినా ఎందుకనో కరణ్ అవుట్ పుట్ విషయంలో సంతృప్తి చెందక చివరికి కార్తీక్ ఆర్యన్ ని ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. కార్తీక్ ఆర్యన్ క్రమశిక్షణ పైనా నిందలు వేశారు.
ప్రస్తుతం అతని స్థానంలో మరో హీరో నటిస్తున్నాడు. దీంతో జాన్వీ- కార్తీక్ ప్రేమాయణంపై ఎన్నో సందిగ్ధతలు అలానే ఉన్నాయి. ఇంతకుముందు ఇద్దరూ కలిసి డిజైనర్ మనీష్ మల్హోత్రా 2021 న్యూ ఇయర్ పార్టీకి జాన్వీ- కార్తీక్ జంట హాజరయ్యారు. అది అకేషనల్ అని అంతా అనుకున్నారు. అయితే ఈ జంట ఆ తర్వాత కూడా ఓ వెకేషన్ స్పాట్ లో కలిసి కనిపించడంతో ప్రేమ గీమా అంటూ ప్రచారం హీటెక్కించింది. అంతేకాదు.. హాట్ పెయిర్ గోవాలో ఓ రిసార్ట్ లో ను ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో సన్నిహితంగా మెలుగుతోన్నో ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండను ప్రేమిస్తున్నానని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి షాకిచ్చింది జాన్వీ. అంతకుముందు కూడా దేవరకొండ అంటే ఇష్టమని తనతో కలిసి నటించాలనుందని కూడా జాన్వీ బహిరంగంగానే వెల్లడించింది. కానీ ఇప్పుడు దీపావళి పార్టీలో కొత్త యువకుడితో కనిపించింది. ఇంతకీ ఎవరు అతగాడు.. జాన్వీకి నచ్చిన ఆ చెలికాడు! అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జాన్వీ త్వరలోనే టాలీవుడ్ లో అడుగుపెట్టే వేళ ఇలాంటి పుకార్లు షికార్ చేయడం ఆసక్తికరం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.