వీడియో : జిమ్ లో కష్టపడుతున్న సుకుమారి

Update: 2022-09-23 16:43 GMT
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా స్టార్‌ డమ్ దక్కించుకోకున్నా కూడా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలు మరియు వీడియోలతో వైరల్‌ అవుతూ స్టార్‌ డమ్ దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ప్రస్తుతానికి బాలీవుడ్‌ లోనే సినిమాలు చేస్తోంది. సౌత్‌ నుండి కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా కాదన్నట్లుగా సమాచారం అందుతోంది.

తాజాగా ఫిల్మ్‌ ఫేర్‌ కోసం రెడీ అవుతున్నాను అంటూ ఈ వర్కౌట్ వీడియోను షేర్‌ చేసింది. చూడ్డానికి అందంగా నాజూకుగా కనిపించేందుకు గాను ముద్దుగుమ్మలు ఈ స్థాయిలో కష్టపడాలా అంటూ సామాన్య ప్రేక్షకులు నోరు వెళ్లబెడుతున్నారు. కెరీర్‌ ఆరంభంలో కాస్త ఎక్కువ బరువు ఉన్న జాన్వీ కపూర్‌ ఇప్పుడు మాత్రం సన్నగా నాజూకుగా కనిపిస్తుంది.

తాజాగా షేర్‌ చేసిన వీడియోలో కూడా ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ సాధ్యం అయినంత ఎక్కువ వర్కౌట్స్ ను చేస్తూ తన మంచి ఫిజిక్ కోసం కష్టపడుతూ ఉంది. త్వరలోనే జరుగబోతున్న ఫిల్మ్‌ ఫేర్‌ కోసం ఈ స్థాయిలో రెడీ అవుతున్న ముద్దుగుమ్మ ఈమె అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే... మీ యొక్క అంకితభావంకు హ్యాట్సాప్‌ అంటూ అభినందిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే వరుసగా ఈమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. అయినా కూడా ఈ అమ్మడి యొక్క చరిష్మా మాత్రం తగ్గడం లేదు. స్టార్‌ కిడ్‌ అవ్వడం వల్లనో లేదా మరేంటో కానీ ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సౌత్‌ సినిమాకు సంబంధించిన ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ సౌత్‌ హీరోకు ఈమె ఓకే చెప్పలేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News