అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ విషయంలో అదిగో పులి ఇదిగో తోక అన్న ప్రచారం తప్ప అసలు సంగతి తెలలేదు. రెండు..మూడేళ్లగా మీడియా కథనాలు తప్ప ఏనాడు జాన్వీగానీ...బోనీ కపూర్ గానీ టాలీవుడ్ ఎంట్రీపై స్పందించలేదు. ఇటీవల ఆ ప్రచారం పీక్స్ కి చేరింది. జాన్వీ అభిమానించే విజయ్ దేవరకొండ తో `జనగణమన`లో నటిస్తుందని టాక్ వినిపించింది.
పూరి జగన్నాధ్ విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి పూజాహెగ్డేని ఎంపిక చేసినట్లు వెలుగులోకి వస్తుంది. జాన్వీ అభిమానించే హీరో సరసన నో చెప్పిందంటే ఇప్పుడప్పుడే టాలీవుడ్ లో నిజంగా ఎంట్రీ ఇస్తుందా? అన్న సందేహం రాకమానదు. అవును పరిస్థితులు అలాగే కనిస్తున్నాయి. జాన్వీ సౌత్ లో లాంచ్ అవ్వాలన్నా..తెలుగు సినిమా చేయాలన్నా? అదంతా ఆమె చేతుల్లో లేదు.
ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది తండ్రి బోనీకపూర్. తండ్రి సూచనలు..సలహాలతోనే జాన్వీ ప్రయాణం సాగిస్తుంది. సరైన టైమ్ చూసి సౌత్ లో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది తప్ప ఇప్పుడప్పుడే అది జరగదని తెలుస్తోంది. ఎందుకంటే జాన్వీ కెరీర్ ఇప్పుడే మొదలైంది. ఇంకా చెప్పాలంటే ఆమెకి బాలీవుడ్ లో ఇంతరకూ సరైన సక్సెస్ పడలేదు.
జాన్వీ డెబ్యూ మూవీ `ధడక్` భారీ సక్సెస్ సాధించలేదు. పైగా అది మరాఠీ సినిమా `సైరాత్` రీమేక్. స్ర్టెయిట్ హిట్ ఇప్పటివరకూ లేదు. `ది కార్గిల్ గర్ల్`..`రూహి` లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ జాన్వీ అప్పుడే టాలీవుడ్ లో లాంచ్ అయితే అదేమి గొప్పకాదు. అక్కడ ఫెయిలై ఇక్కడికి వచ్చిందన్న విమర్శ మోయాలి. తల్లి శ్రీదేవిలా ఓ బ్రాండ్ లా ఎంట్రీ ఇవ్వాలి.
అప్పుడే శ్రీదేవికి కుమార్తె రూపంలో ఘనమైన నివాళీ దక్కుతుంది. అతిలోక సుందరి తెలుగులో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అంతకు మించి దక్షిణాదిన ఆమె పెద్ద స్టార్ హీరోయిన్. అన్ని భాషల్లోనూ నటించారు. అంతటి ప్రఖ్యాతి గాంచిన శ్రీదేవి కుమార్తె సింపుల్ గా ఎంట్రీ ఇచ్చేస్తే సార్ధకత ఎలా దక్కుతుంది? ఇవన్నీ బేరీజు వేసుకునే బోనీకపూర్ ముందుగా బాలీవుడ్ లో లాంచ్ చేసారు. అక్కడ సక్సెస్ అయితే తప్ప మిగతా భాషల్లో లాంచ్ అయ్యే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం.