నేను.. చిరు.. ఐడెంటిటీ మిస్సయ్యాం

Update: 2017-01-25 05:38 GMT
ఖైదీ నంబర్ 150 ద్వారా మెగాస్టార్ చిరంజీవి సాధించిన ఘనవిజయం సందర్భంగా.. అందరూ ఆయన్ను ఎప్రీషియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాజీ హీరోయిన్.. అలాగే సాటి పొలిటీషియన్ అయిన జయప్రద కూడా మెగాభినందనలు తెలియజేశారు.

''ముందుగా చరణ్ కి కంగ్రాచ్యులేషన్స్. చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ కావడం అనేది ఒక అవకాశం. ఒక తండ్రిని ప్రొడ్యూస్ చేసి ఇంత పెద్ద సక్సెస్ ఇవ్వడం అభినందనీయం. పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి కూడా గొప్ప విజయం సాధించారు'' అంటూ ప్రశంసించారు జయప్రద.

చిరు-జయప్రద కలిసి నటించడమే కాదు.. వారిద్దరికి ఒక సారూప్యత కూడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీతో పాటు ఇద్దరూ రాజకీయాల్లో కూడా ప్రయత్నించినవారే. ఆ అంశాన్ని గుర్తు చేసిన జయప్రద.. ''పాలిటిక్స్ లోకి మేము ఇద్దరం వెళ్లాం. కానీ మేమిద్దరం కూడా మా సొంత ఐడెంటిటీ మిస్సయ్యాం. కానీ ఈ రోజు చిరంజీవి గారు.. ఇలాంటి ఒక మంచి మాస్ సబ్జెక్ట్ తో ఇంత పెద్ద హిట్ సాధించడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.  

''గతంలో చిరంజీవి గారితో కలిసి చేసే అవకాశాన్ని నాకు కొందరు దర్శకులు ఇచ్చారు. వారి ఫ్యామిలీలో తన కూతురుగా చూసుకునేవారు రామలింగయ్య గారు. అరవింద్ గారు ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తారు'' అంటూ మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పారు జయప్రద.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News