జేపీ మృతికి కరోనా కారణం అంటున్నారు..!

Update: 2020-09-09 14:00 GMT
ప్రముఖ నటుడు జయప్రకాష్‌ రెడ్డి మృతిపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్‌ షాలు కూడా ఆయన మరణంపై స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. అంతటి పేరు తెచ్చుకున్న జేపీ ఉన్నట్లుండి ఎలా మృతి చెందా అంటూ సన్నిహితులు మరియు స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అంత హఠాత్తుగా జేపీకి గుండె పోటు ఎలా వచ్చింది అంటూ ఆరా తీయగా కుటుంబ సభ్యుల నుండి అందిన సమాచారం ప్రకారం ఆయన కరోనా వల్ల భయపడ్డాడు. టెన్షన్‌ పెట్టుకుని చివరకు గుండె పోటుతో మృతి చెందాడు అంటున్నారు.

కొన్ని నెలల క్రితం జేపీకి వైధ్యులు జేపీ గుండెకి స్టంట్స్‌ వేశారు. ఎక్కువగా ఒత్తిడి తీసుకోకుండా ప్రశాంతంగా ఉండాలంటూ వైధ్యలు సూచించారు. కాని ఇదే సమయంలో జేపీ కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందట. వారి ఇంట్లో జేపీ కాకుండా మిగిలిన వారు అంతా కూడా కరోనా పాజిటివ్‌ అంటూ వెళ్లడి అవ్వడంతో ఆయన కృంగిపోయాడు. తనకు నెగిటివ్‌ అంటూ వచ్చినా కూడా భార్య పిల్లలను గురించి ఆలోచించడం వల్లే ఆయనకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చి ఉంటుందని ఒత్తిడిలో గుండే మరింతగ ఇబ్బంది పడి ఉంటుంది. అందుకే ఆయన మృతి చెంది ఉంటాడు అంటూ వైధ్యలు చెబుతున్నారు. అందుకే పరోక్షంగా జేపీ మృతికి కరోనా కారణం అంటున్నారు.
Tags:    

Similar News