జయసుధ, రాధిక, శ్రీప్రియ ఈ ముగ్గురూ గొప్ప స్నేహితులు అన్న సంగతి ఎంతమందికి తెలుసు. ఈగోలకు తావులేకుండా వీరంతా ఇప్పటికే స్నేహం కొనసాగిస్తుంటారు. చెన్నయ్ వెళ్లినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్లంతా ఫ్యామిలీ మీట్ పెట్టుకుంటారు. కలిసి డిన్నర్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఒకరి కుటుంబంతో మరొకరికి చక్కని అనుబంధం ఉంది. ముఖ్యంగా జయసుధ, రాధిక మధ్య జనరేషన్ గ్యాప్ ఉన్నా ఈ ఇద్దరి మధ్యా ఉన్న సన్నిహిత సంబంధాలు ఆల్ టైమ్ హాట్ టాపిక్.
రాధిక చెన్నయ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు జయసుధ ఇంట్లోనే ఉంటారు. అలాగే జయసుధ చెన్నయ్ వెళ్లినప్పుడు రాధిక ఇంట్లోనే ఉంటారు. ఈ విషయంపై జయసుధ మాట్లాడుతూ.. రాధిక నా తర్వాతి తరం నటి. అయినా బాగా క్లోజ్. నేను చెన్నయ్ వెళ్లినప్పుడు రాధిక ఇంట్లోనే ఉంటే. తనకి అక్కడ రెండు ఇల్లు ఉన్నాయి. వాటిలో ఒకటి నాకిచ్చేస్తుంది. జితేందర్ తో కలిసి హిందీ సినిమా తీయాలనుకున్నప్పుడు రేఖ మొదటి హీరోయిన్, రాధిక రెండో హీరోయిన్.. అంటే వృత్తి పరంగానూ మేం కలిసే ఉంటామని జయసుధ చెప్పారు.
అయితే స్నేహితులిద్దరిలో రాధిక బుల్లితెర క్వీన్ గా రాణిస్తున్నారు. జయసుధ ఇటీవలే రాజయకీయాల్లోంచి తిరిగి వెండితెరపైకి వచ్చి క్యారెక్టర్ నటిగా కొనసాగుతున్నారు.