తెలుగుగడ్డ మీద జనసేన పార్టీ ఇంకాఫేమస్ కాలేదా? అందరికి పవన్ కల్యాణ్ పార్టీ అనేది ఒకటి ఉందని తెలుసుకానీ.. దాని పేరు జనసేన అని కూడా తెలీదా?అంటే.. అవుననే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో సినిమాలున్న ఒక సీనియర్ నటి కమ్ పొలిటికల్ లీడర్ ను జనసేన పార్టీ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె నుంచి వచ్చిన సమాధానం షాకింగ్ గా ఉండటమే కాదు.. కొత్త ఆసక్తిని రేపుతోంది.
సహజ నటిగా పేరున్న జయసుధ సినిమా యాక్టరే కాదు.. పొలిటీషియన్ కూడా సుపరిచితురాలు. వైఎస్ బతికున్న వేళ.. రెండుసార్లు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి..ఒకదశలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుందా? అన్న ఆసక్తికర చర్చ కూడా సాగింది. నటిగా వెండితెర మీద ఆమెకు పడే మార్కులతో పోలిస్తే.. పొలిటీషియన్ గా ఆమెకు తక్కువ మార్కులే పడతాయని చెప్పక తప్పదు.
అలాంటి ఆమెను తాజాగా ఒక ఇంటర్వ్యూలో జనసేన పార్టీ గురించి ప్రశ్నిస్తూ.. ‘‘మీరు జనసేన పార్టీలో చేరతారా?’’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘జనసేన పార్టీనా? ఎవరిది?’ అని ఎదురుప్రశ్న వేయటంతో నోట వెంట మాట రాని పరిస్థితి. ఇలాంటి సమాధాన్ని ఏ మాత్రం ఊహించని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. కాస్త డిటైల్స్ చెబుతూ.. పవన్ కల్యాణ్ పార్టీ అని చెప్పటంతో ఆమె రియాక్ట్ అవుతూ.. ‘పవన్ పార్టీ జనసేన అని తనకు తెలీదని.. పవన్ కల్యాణ్ పార్టీ అంటే తనకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
పవన్ ఆలోచనలు బాగున్నాయని.. తాను అందరిని సపోర్ట్ చేస్తానని చెప్పిన ఆమె.. పార్టీలో జాయిన్ అవుతారా? అంటూ మళ్లీ అడిగిన ప్రశ్నకు సమాధానం గతంలో కూడా చిరంజీవి పార్టీలో చేరతారా? అని అడిగేవారు.. ఆర్నెల్లకే ఆయన మా పార్టీలో చేరిపోయారంటూ ముక్తాయించారు. సీనియర్ నటి కమ్ రాజకీయ నేతకు కూడా పవన్ పార్టీ గురించి తెలియకపోవటం ఏమిటి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/