సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో తల్లి పాత్రలో చాలా హుందాగా నటించారు సహజనటి జయసుధ. వాడికి అంతే వచ్చురా.. వాడి మాట అంతే ఉంటుంది. నీకులాగా మాయలు చెప్పడం రాదురా.. అంటూ పెద్ద కొడుకు వెంకటేష్‌ను వెనకేసుకొస్తూనే తల్లి ప్రేమను చాలా చక్కగా చూపించారు ఆమె. ఇదంతా ఆన్ స్క్రీన్. తాజాగా సొంత బిడ్డల ఆనందాన్ని చూసి ఆమె ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహం జరిగింది. ఫిబ్రవరి 26వ తేదీన ఢిల్లీకి చెందిన అమృత్‌కౌర్‌ను అంగరంగ వైభవంగా పెళ్లాడిన నిహార్ కపూర్ మోములో సంతోషం వెల్లివిరుస్తోంది. . కొత్త కోడలుని చూసి అత్త జయసుధ మురిసిపోతున్నారట.
శనివారం వివాహ రిసెప్షన్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అదిరిపోయే అలంకారంతో అతిథులకు ఆహ్వానం పలికారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ఈ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను మనసారా ఆహ్వానించారు. ఇందులో టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ-, నటుడు మోహన్‌బాబు- దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.
మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ.. విజయనిర్మల మరణానంతరం బయటికి కనిపించలేదు. భార్య మరణంతో ఎంతో దిగులు పడిన ఆయన ఇప్పుడు రిసెప్షన్ లో కనిపించే సరికి ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు.
కుమారుడు నిహార్ కపూర్ వివాహ రిసెప్షన్ లో జయసుధ అందరినీ కలుపుగోలుగా పలకరిస్తూ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఆమె ఇటు వరుసగా సినిమాలు చేస్తూనే.. అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. ఇప్పుడు వ్యాపార వేత్తగా ఎదుగుతున్న పెద్ద కుమారుడ్ని పెళ్లి పీటలు ఎక్కించిన ఆమె చాలా ఖుషీగా ఉన్నారు. ఇక చిన్న కుమారుడు శ్రీయాన్ కపూర్ పైనే ఆమె దృష్టంతా.. ఇక కొత్త జంట నిహార్ కపూర్, అమృత్ కౌర్ ను మనమూ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం అందిద్దాం.