జయసుధ కుమారుడు.. కంగారుపడడు

Update: 2016-07-31 07:30 GMT
మాజీ హీరోయిన్ జయసుధ ప్రస్తుతం సినిమాల్లో తక్కువ గానే కనిపిస్తున్నా.. తన స్థాయికి తగ్గ పాత్రలు వస్తేనే అంగీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె కొడుకు శ్రేయాన్ కపూర్ గతేడాదే టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. బస్తీ మూవీతో జనాలను పలకరించినా.. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. మాజీ స్టార్ హీరోయిన్ కొడుకు అయినా.. ఇప్పటివరకూ ఇతడు రెండో సినిమా స్టార్ట్ చేయలేదు.

రెండో సినిమా మొదలు పెట్టడంలో కంగారేమీ లేదంటున్నాడు శ్రేయాన్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం చాలా స్క్రిప్టులు వింటున్నానని.. రెండో సినిమాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేయడం బోర్ అంటున్న శ్రేయాన్.. ప్రస్తుతం వస్తున్న సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ గా చేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పాడు. అయితే సినిమాలే ఇతడికి ప్రధానం కాదు.

నేషనల్ లెవెల్ షూటింగ్ లో ఏపీ - తెలంగాణ తరఫున చాలానే మెడల్స్ గెలుచుకున్నాడు శ్రేయాన్. అటు స్పోర్ట్స్ పర్సన్ గా  సక్సెస్ అయి.. ఇటు సినిమాల్లోనూ ప్రయత్నిస్తున్నాడు. అయితే కంగారు పడకుండా నింపాదిగా సినిమాలు చేసుకుంటానంటే.. జనాలు పట్టించుకుంటారా.. గుర్తుంచుకుంటారా? అన్నదే డౌట్.
Tags:    

Similar News