అలీ షోలో ఏడ్చేసిన జీవిత!

Update: 2022-01-08 03:30 GMT
రాజశేఖర్ - జీవిత .. కెరియర్ తొలినాళ్లలో హీరో హీరోయిన్లుగా కొన్ని సినిమాలు చేశారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో 'అంకుశం' .. 'ఆహుతి' .. 'తలంబ్రాలు' భారీ విజయాలను సాధించాయి. ఆ తరువాత కాలంలో రాజశేఖర్ హీరోగా కొనసాగుతూ ఉండగా, జీవిత దర్శక నిర్మాతగా కొనసాగుతున్నారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో 'శేఖర్' సినిమా రూపొందుతోంది. ఈ ఇద్దరూ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది. అలీ సరదా ప్రశ్నలు .. రాజశేఖర్ తమాషా సమాధానాలు .. జీవిత ఎమోషన్ కావడం ఈ ఎపిసోడ్ హైలైట్స్ గా కనిపిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ .. " ఓ సినిమా ప్రివ్యూలో ఒకరికి ఒకరం తారసపడ్డాము .. ఓ తమిళ సినిమా షూటింగులో హీరోహీరోయిన్లుగా కలుసుకున్నాము. ఆమె హీరోయిన్ ఏంటి? మార్చేయమని దర్శకుడికి చెప్పాను. ఆయన ఆమెను కాకుండా నన్ను మార్చేశాడు. నేను డాక్టర్ చదివాను .. ఎగ్జామ్స్ సమయం వచ్చినప్పుడు మాత్రం యాక్టర్ ను అయితే బాగుండునే అనిపిస్తుంది. అప్పట్లో నాకు బాగా నత్తి ఉండేది. ఎవరినైనా అవకాశాలు అడిగితే, నాకు నాకు నత్తి అని తెలిస్తే అసహ్యంగా ఉంటుందని అడిగేవాడిని కాదు.

నాలాగే శివాని కూడా డాక్టర్ చదివి .. యాక్టర్ అయింది. అది నాకు ఆనందాన్నే కలిగించింది. జీవితను నేను కుట్టీ అని పిలుస్తాను. ఆమెను మాత్రమే అలా పిలుస్తాను .. ఇంకెవరినీ అలా పిలవను. మా మధ్య విభేదాలు ఎప్పుడూ లేవు. ఆమె దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తూ ఉంటాను. బయట ఫైర్ బ్రాండ్ గా ఉన్నప్పటికీ .. ఇంట్లో మాత్రం మామూలుగానే ఉంటుంది. అప్పుడప్పుడు మాకు ఒక వారసుడు ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది. నాకు కోవిడ్ వచ్చినప్పుడు చనిపోతానని అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

జీవిత మాట్లాడుతూ .. " నేను ఆయనను బంగారం అని పిలుస్తుంటాను. ఆయన 'శేఖర్' సినిమాకి దర్శకత్వం చేస్తున్నాను. ఈ సినిమాలో కొత్త రాజశేఖర్ ను చూస్తారు. ఈ సినిమా మొదలుపెట్టడానికి వారం రోజుల ముందే ఆయనకి  కోవిడ్ వచ్చింది .. చాలా సీరియస్ అయింది. దాదాపు నెల రోజుల పాటు ICUలో ఉన్నారు. తను చనిపోతానని ఆయన అనుకున్నారట. నిజంగానే అప్పుడు పరిస్థితి అలాగే ఉంది" అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ షోకి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.       
Tags:    

Similar News