‘గరుడవేగ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. తమకు ఇండస్ట్రీలో ఎవరూ లేరనుకున్నామని.. కానీ ఈ సినిమా విడుదలకు ముందు.. తర్వాత ఇండస్ట్రీ నుంచి.. జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తే కడుపు నిండిపోతోందని.. థ్యాంక్స్ అనే మాట అంటే చాలా చిన్నదైపోతుందని ఆమె అన్నారు.
‘గరుడవేగ’ విడుదలకు రెండు రోజుల ముందే తన అన్నయ్య చనిపోయాడని.. ఐతే దేవుడు మనకు సంతోషాలతో పాటు బాధల్ని కూడా ఇస్తాడని.. సంతోషంలో సంబరాలు చేసుకున్నపుడు బాధను కూడా అంగీకరించాల్సిందే అని.. అందుకే ఈ విషయాన్ని అంగీకరించి సక్సెస్ మీట్లో పాల్గొంటున్నామని జీవిత చెప్పింది.
‘గరుడవేగ’ సినిమాకు సంబంధించి తాను ఐదుగురు వ్యక్తులకు తాను రుణపడి ఉంటానని జీవిత అన్నారు. ఈ సినిమాను ఎంత కష్టపడి తీసినప్పటికీ దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచించామని.. అలాంటి సమయంలో రానా.. కాజల్ అగర్వాల్.. తాప్సి.. మంచు లక్ష్మిలకు ఫోన్ చేసి మీరంతా మా టీజర్ లాంచ్ చేయాలని అడిగామని.. వాళ్లందరూ మరో మాట మాట్లాడకుండా ఇందుకు ఒప్పుకున్నారని అంది.
వాళ్లు నలుగురూ ఏ రోజు.. ఎన్ని గంటలకు టీజర్ లాంచ్ చేయాలని అడిగారని.. లింక్ పంపించమని కోరారని.. తాప్పి.. కాజల్ లాంటి వాళ్లతో తమకు ఎలాంటి పరిచయం లేకపోయినా.. వాళ్లు టీజర్ లాంచ్ కు అంగీకరించడం గొప్ప విషయమని.. ఇలా ఒకేసారి నలుగురు టీజర్ లాంచ్ చేయడంతో జనాల్లో చర్చ జరిగిందని.. అలా ఈ సినిమా ప్రమోషన్ మొదలైందని జీవిత చెప్పింది.
అలాగే ‘గరుడవేగ’ ట్రైలర్ లాంచ్ కోసం బాలయ్యను అడిగితే.. ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారని.. స్వయంగా ముహూర్తం పెట్టి మరీ ట్రైలర్ లాంచ్ చేశారని.. ఈ ఐదుగురికీ తాము రుణపడి ఉంటామని జీవిత తెలిపింది. ఇక విడుదల తర్వాత చిరంజీవి.. మహేష్ బాబు సహా చాలామంది తమకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని.. తమకు ఎవరూ లేరని అనుకునే వాళ్లమని.. అలాంటిది ఈ రోజు ఇండస్ట్రీ మొత్తం తమకు సపోర్ట్ ఇచ్చిందని.. రాజశేఖర్ కు సక్సెస్ రావడం గురించి అందరూ చాలా సంతోషించి అభినందించారని జీవిత ఉద్వేగంగా చెప్పింది.