నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ`. క్రికెట్- మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు నాట డీసెంట్ హిట్ అన్న టాక్ వినిపించినా.. బాక్సాఫీస్ వద్ద లాభాలు రాలేదని ట్రేడ్ విశ్లేషించింది. అయితే ఈ సినిమా ఒరిజినల్ కంటెంట్ .. నాని పెర్ఫామెన్స్ పలువురు ఫిలింమేకర్స్ ని టచ్ చేసింది.
అందుకే ఈ సినిమాని ఇరుగు పొరుగు భాషల్లో రీమేక్ చేసేందుకు ఓ ఇద్దరు అగ్ర నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తొలిగా జెర్సీ హిందీ వెర్షన్ ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలతో కలిసి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు- అల్లు అరవింద్ జోడీ నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ లేదా వరుణ్ ధావన్ ని హీరోగా ఎంచుకునే ఆలోచన చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే జెర్సీ హిందీ వెర్షన్ కి గొప్ప క్రేజు నెలకొంటుందనడంలో సందేహం లేదు.
ఈ సినిమాని చైనాలోనూ రిలీజ్ చేస్తున్నామని `జెర్సీ` రిలీజ్ ప్రమోషన్స్ లో నిర్మాత వంశీ అన్నారు. అయితే అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయన్నదానిపై సరైన క్లారిటీ లేదు. చైనా మార్కెట్ ఇండియన్ సినిమాలకు పెద్ద గిఫ్ట్ గా మారిన ఈ ట్రెండ్ లో జెర్సీని అక్కడికి తీసుకెళతారా లేదా? అన్నది చూడాలి. ఇక హిందీ వెర్షన్ తో పాటుగా ఇరుగు పొరుగు భాషల్లోనూ జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారా.. లేదా? అన్నదానిపై అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. దిల్ రాజు- అల్లు అరవింద్ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ అలయెన్స్ కు సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుందట.