విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'జనగణమన' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య చిత్రాన్ని ముంబై లో ప్రారింభించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా జేజీఎమ్ తెరకెక్కుతుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. దీంతో విజయ్ సైనికుడిగా కనిపిస్తాడా? మేజర్ గా కనిపిస్తాడా? అన్నది ఉత్కంఠగా మారింది.
కశ్మీర్ వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా కావడంతో యాక్షన్ సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. సాధారణ చిత్రాల్లోనే పూరి యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. ఇక వార్ సినిమాలో ఇంకే స్థాయిలో హీరోని ఎలివేట్ చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరోయిన్ పాత్ర అంతే ధీటుగా ఉంటుందని లీకులు చెబుతున్నాయి.
ఇందులో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. ఆమె పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఆమె కోసం ఏకంగా థాయ్ లాండ్ నుంచి మార్షల్ ఆర్స్ట్ ట్రైనర్ నే ముంబైకి రప్పిస్తున్నట్లు తెలుస్తుంది. పూజాహెగ్డే రోల్ కూడా హీరోకి ధీటుగానే సాగుతుందిట. దీంతో ఆ పాత్ర మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉండటంతో అందులో ప్రత్యేకంగా ట్రైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
బుధవారం నుంచి పూజాకి మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్ ప్రారంభమవుతుందిన సమాచారం. మూడు రోజుల పాటు ఏక ధాటిగా ఈ శిక్షణ కొనసాగుతుందిట. అనంతరం కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ట్రైనింగ్ ఉంటుందని సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. అదే నిజమైతే పూజా వెండి తెరపై సరికొత్తగా ఊహించొచ్చు. ఇప్పటిరకూ అమ్మడికి యాక్షన్ చిత్రాల్లో నటించే అవకాశం రాలేదు.
కేవలం గ్లామర్ డాల్ గానే మెప్పించింది. కొన్ని సన్నివేశాలకు..పాటలకే పరమితమైంది. ఇప్పుడా ఫరిది దాటి ఓ అడుగు ముందుకు పడుతుంది. మరి పూరి యాక్టింగ్ కి ఎంత స్కోప్ ఇస్తున్నారు? అన్నది తెలియాలి. ఏది ఏమైనా యాక్టింగ్ ఎలా ఉన్నా గ్లామర్ భామగా మాత్రం పూరి శైలి మిస్ అవ్వదు అన్నది వాసత్వం.
ఇక 'జనగణమన' షూటింగ్ జూన్ 4 నుంచి మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు మొదటి షెడ్యూల్ ముంబైలోనే జరుగుతుంది. అక్కడ నుంచి షూటింగ్ కశ్మీర్ కి షిప్ట్ అవుతుందని సమాచారం. అవసరం మేర కొన్ని షెడ్యూల్స్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.