ఏదో ఒక వివాదం లేనిదే నిద్రపట్టని తమిళ స్టార్ హీరో శింబు ఈ మధ్య కాస్త కుదురుగా కనిపిస్తున్నాడు. మణిరత్నం సినిమా ఫినిషింగ్ లో ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తనతో చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. హీరోయిన్ల విషయంలో దర్శకులకు ఏదో ఒక చిక్కు సమస్య తెచ్చి పెట్టే శింబు ఇప్పుడు దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని టార్గెట్ చేసాడట. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా మానాడు అనే సినిమా ఒకటి తెరకెక్కబోతోంది. పూర్తి రాజకీయ నేపధ్యంలో చాలా వివాదాస్పద అంశాలను వెంకట్ ప్రభు టచ్ చేయబోతున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. తన పార్టీ మూవీ ఫినిషింగ్ లో బిజీగా ఉన్న వెంకట్ ప్రభు అది పూర్తవ్వగానే ఈ మానాడు పని మొదలుపెడతాడు. ఈ లోపు హీరోయిన్ సెలక్షన్ చేసుకుంటే ఓ పనైపోతుంది అనే ఉద్దేశంతో ఆప్షన్స్ ని రెడీ చేస్తున్నాడట. అందులో ఉన్న మొదటి పేరు జాన్వీ కపూర్.
జాన్వీని సౌత్ కి పరిచయం చేసే విషయంలో బ్రతికున్నపుడు శ్రీదేవి ఫేవర్ గానే ఉంది. కాకపోతే హిందీ సినిమాల్లో ఋజువు చేసుకున్నాక ముందు తమిళ్ ఎంట్రీ చేయించాలి అనేదే తన కోరికగా చెప్పుకునే వారు. అందుకే శింబు సినిమా ద్వారా జాన్వీని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందనే దిశగా శింబు వెంకట్ ప్రభు ఆలోచిస్తున్నారని కోలీవుడ్ టాక్. అది అంత ఈజీ కాదు. బాగా సీనియర్ అయిన శింబు పక్కన లేత తమలపాకు లాంటి ఒక్క సినిమా హీరోయిన్ జాన్వీని నటింపజేసేందుకు బోనీ కపూర్ ఒప్పుకుంటాడా అనేది ప్రశ్నార్థకం. ఇది అయ్యే పనిలా లేదని ముందే ఊహించారు కాబోలు మరోపక్క కీర్తి సురేష్ తో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయట. కాకపోతే జాన్వీ నో అంటేనే కీర్తి వైపు టర్న్ కావొచ్చని వినికిడి. అజిత్ గ్యాంబ్లర్ ద్వారా మనవాళ్లకు కూడా పరిచయమున్న దర్శకుడు వెంకట్ ప్రభు టేకింగ్ కు ఇక్కడ కూడా ఫాన్స్ ఉన్నారు.