ఊహించినట్టే జాన్వీ డెబ్యూ సినిమా `ధడక్` వసూళ్ల తడాఖా చూపిస్తోంది. ఇంటా బయటా ఈ సినిమా చక్కని వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి వీకెండ్ ఇప్పటికే దాదాపు 30 కోట్ల మేర నెట్ వసూలు చేసిందని ట్రేడ్ లెక్క చెబుతోంది. ఈ రిజల్ట్ జాన్వీ మాయాజాలం అనే చెప్పాలి. ఇక స్వర్గలోక విహారం చేస్తున్న మామ్ శ్రీదేవి ఆనందవిహారం చేసే సన్నివేశమే ఇది. తన కూతురు నుంచి తాను ఏం ఆశించిందో అది తొలిరోజే క్రిటిక్స్ ప్రశంసల రూపంలో దక్కించుకుంది. మామ్ ఇహలోకంలో ఉంటే ఇంకా ఎంత ఇదైపోయేదో! మొత్తానికి ధడక్ చిత్రం నాయకానాయికలు ఇషాన్ - జాన్వీలకు ఆశించిన ఫలితం అందించింది. తొలి సినిమా చెత్త సినిమా అన్న బ్యాడ్ టాక్ లేకపోవడం ఆ ఇద్దరికీ కెరీర్ పరంగా ప్లస్ అవుతోంది. డెబ్యూల్ని పరిచయం చేసిన నిర్మాతగా కరణ్ జోహార్‌కి ఇది ఎంతో గౌరవాన్ని ఇస్తోంది.
ఇకపోతే ధడక్ స్వదేశీ బాక్సాఫీస్ వద్ద 3రోజులకు 30 కోట్ల మేర నెట్ వసూలు చేస్తే, విదేశాల నుంచి మరో 6 కోట్ల (858కె డాలర్లు) వరకూ వసూలు చేసిందని తెలుస్తోంది. దీనిని బట్టి శ్రీదేవిపై సింపథి పెద్ద స్థాయిలోనే వర్కవుటైందనే చెప్పాలి. కేవలం ఇండియాలో 3రోజుల్లో 30కోట్ల నెట్ వసూళ్లు అంటే ఆషామాషీ ఏం కాదు. అలానే ఓవర్సీస్ నుంచి చక్కని రిజల్ట్ అందుకోవడమ ప్రశంసనీయం. అమెరికాలో ఆరంభమే జాన్వీ ఇంత ఊపు తేగలిగింది అంటే మునుముందు ఇంకా పెద్ద స్టార్ అయ్యే ఛాన్సుంటుంది. ఓవర్సీస్ మార్కెట్ స్టార్ల ఎదుగుదలకు సూచికగా మారుతున్న నేటిరోజుల్లో ఈ ఫలితం జాన్వీకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. శ్రద్ధాకపూర్ - సోనమ్ కపూర్ - సోనాక్షి వంటి నటవారసురాళ్లకు ఉన్న క్రేజు జాన్వీ తెచ్చుకోగలిగితే - అది తనకు లాభిస్తుందనడంలో సందేహం లేదు.