తండ్రి పక్కనున్నా.. పిల్ల రచ్చ రచ్చే

Update: 2018-05-21 04:33 GMT

అందాల తార శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తల్లి అందాన్ని అందిపుచ్చుకుని పుట్టిన జాన్వి తల్లి వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకుని హీరోయిన్ అవుతుందని అందరూ మొదటి నుంచి నమ్మారు. పుట్టి పెరిగిందంతా గ్లామర్ ఫీల్డ్ లోనే కావడంతో హీరోయిన్ కావడానికి జాన్వి కూడా తెగ ఉత్సాహ పడిపోయింది.

హీరోయిన్ గా ఎంట్రీ ఫిక్సయినప్పటి నుంచి జాన్వి  అవుట్ డోర్ లో ఎప్పుడు కనిపించినా గ్లామరస్ లుక్ తో అందరినీ కట్టి పడేస్తూనే వచ్చింది. అనూహ్యంగా దుబాయ్ లో శ్రీదేవి మరణించడంతో డీలా పడిపోయిన జాన్వి త్వరగానే కోలుకుంది. మళ్లీ నెమ్మదిగా రెగ్యులర్ షూటింగ్ లకు అటెండవుతూ తన మొదటి సినిమా ప్రాజెక్టులో బిజీ అయిపోయింది. తాజాగా తండ్రి బోనీ కపూర్ తో పబ్లిక్ ప్లేస్ లో కనిపించిన జాన్వి తన గ్లామర్ తో అందరి చూపులను కట్టిపడేసింది. అమాయకంగా తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్నట్లే ఉన్నా గ్లామర్ డాల్ గా తన ఎంత స్పెషలో చెప్పకనే చెప్పినట్టు కనిపించింది. నడుము అందాలు చూపిస్తూ ఆమె నడిచొచ్చిన తీరు పిల్ల మామాలుగా రచ్చ చేయలేదనిపించింది.

మరాఠీ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సైరట్ మూవీగా తెరకెక్కుతున్న ధడక్ సినిమాతో జాన్వి వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ మూవీకి నిర్మాత. 
Tags:    

Similar News