ఆ హీరోయిన్ కెరీర్ లోనే రిలీజ్ తలకు మించిన భారం!
అయితే `ఎమర్జెన్సీ` రిలీజ్ విషయంలో మాత్రం కంగన తలకు మించిన భారం నెత్తిన ఎత్తుకుని ఇంకా భారంగానే మోస్తోంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కెరీర్ లోనే ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కుంది. వృత్తిగతంగా..వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎన్నో విమర్శలకు గురైంది. వాటికి తనదైన శైలిలో బధులిచ్చి తగ్గేదేలే అని నిరూపించిన సందర్భాలెన్నో. 18 ఏళ్ల సినీ ప్రస్తానంలో ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదుర్కుంది. అయితే `ఎమర్జెన్సీ` రిలీజ్ విషయంలో మాత్రం కంగన తలకు మించిన భారం నెత్తిన ఎత్తుకుని ఇంకా భారంగానే మోస్తోంది. ఆమె స్వీయా దర్శకత్వంలో ఈ చిత్రం మొదల్లవడం, పూర్తయిన సంగతి తెలిసిందే.
మాజీ ప్రధానీ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా రిలీజ్ విషయంలో కంగనా ఎలాంటి సవాళ్లు ఎదుర్కుందో తెలిసిందే. సినిమాలో భాగంగా ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్ వాల్ ని టెర్రరిస్ట్ గా చూపిస్తే గనుక ఇందీరాగాంధీని హత్య చేసినట్లు చంపేస్తామని విక్కీ థామ్ సింగ్ అనే వ్యక్తి బెదిరించాడు. ఇలాంటి బెదిరింపులు ఒకటి కాదు..రెండు కాదు ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది అన్న నాటి నుంచే కంగనపై ఎటాక్ మొదలైంది.
మరోవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కుంది. వివిధ రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ చేయనివ్వమంటూ హెచ్చరికలు ఎదుర్కుంది. అటుపై సెస్సార్ సైతం రిలీజ్ కి అభ్యంతరం తెలపడం తెలిసిందే. ఇలా సినిమాకి సంబంధించి ఎన్నోసార్లు రిలీజ్ తేదీలు ప్రకటించి వెనక్కి తీసుకుంది. సెప్టెంబర్ నుంచి రిలీజ్ తేదీ ప్రకటించగా డిసెంబర్ వరకూ ఎన్నో తేదీలు వచ్చాయి. చివరిగా డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేసింది. కానీ అది కూడా సాధ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా వచ్చే ఏడాది జనవరి 17న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కంగన ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఏ సినిమా రిలీజ్ కి ఇలాంటి అడ్డంకి ఎన్నడు ఎదురవ్వలేదు. తొలిసారి ఎమర్జెన్సీ రిలీజ్ విషయంలో అన్నీ ఆటంకాలే. ప్రస్తుతం కేంద్రలో బీజీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీలోనే కంగన ఎంపీగా కూడా గెలిచింది. ప్రభుత్వంలో అనుకూలమైన వ్యక్తులున్నా సరే ఎమర్జెన్సీ రిలీజ్ విషయంలో కంగనకు వైఫల్యమే ఎదురైంది.