టాలీవుడ్ సినిమాల్లో ప్రస్తుతం ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను మించినోళ్లు మరొకరు లేరని ఒప్పుకోవాల్సిందే. రామ్ చరణ్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో.. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో జిగేల్ రాణి అంటూ ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ జరుగుతోందని ఇప్పటికే చెప్పేసుకున్నాం.
పూజా హెగ్డే అందాలు ఆరబోసిన ఈ జిగేల్ రాణి సాంగ్ ను ఊహించుకునేందుకే అభిమానులకు ఊపిరి ఆడడం లేదు. రామ్ చరణ్ కోసం జిగేల్ రాణికి ఇచ్చిన పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిజంగానే జిగేల్ మనిపించే అందాలను ఆరబోసే పూజా హెగ్డేను.. ఏకంగా 50 లక్షలు ఇచ్చి మరీ పట్టుకొచ్చాడట దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం ఈ జిగేల్ రాణితో పాట షూటింగ్ కూడా జరిగిపోతోంది. చిట్టిబాబుగా కనిపిస్తున్న చెర్రీ.. పూజాతో ఆడిపాడేస్తున్నాడు కూడా. అయితే.. డీజే మినహాయిస్తే ఇప్పటివరకూ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన పూజా హెగ్డేకు.. ఒక్క ఐటెం సాంగ్ కోసం ఏకంగా 50 లక్షలు చెల్లించడం ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. మిల్కీ బ్యూటీ తమన్నాలు ఈ రేంజ్ లో తీసుకున్నారంటే ఓకే కానీ.. కేవలం 4-5 రోజుల షూటింగ్ కోసం పూజా హెగ్డేకు 50 లక్షలు ఇవ్వడం అంటే అతిశయోక్తిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే. దేవిశ్రీ ప్రసాద్ కట్టిన బాణీ అదిరిపోతుందని.. ఆడియన్స్ ను మత్తులో ముంచేస్తుందని అంటున్నారు. ఇక రామ్ చరణ్ స్టెప్పులు.. సుకుమార్ స్టైల్ మేకింగ్.. పూజా హెగ్డే అందాలు.. అన్నీ కలిపి ఈ జిగేల్ రాణిని అద్భుతం అనిపించేస్తాయని టాక్.