తెలుగు సినిమాకు కష్టకాలం నడుస్తోందిప్పుడు. జనాలూ థియేటర్లకు రావట్లేదు. అలాగని థియేటర్లలోనూ చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. గత శుక్రవారం నాలుగు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి కానీ.. వాటి గురించి మాట్లాడే నాథుడే లేడు. వచ్చే వారం నాని సినిమాలు ఎవడే సుబ్రమణ్యం, జెండాపై కపిరాజు.. వారాహి వాళ్ల తుంగభద్ర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాల మీద ఆసక్తి ఉన్నప్పటికీ మంచి మాస్ మసాలా మూవీ వస్తేనే థియేటర్లు నిండేది. 'జిల్' సినిమా ఆ లోటు కొంత వరకు తీరుస్తుందని.. సమ్మర్ సందడికి తెర తీస్తుందని అంచనాలున్నాయి.
అనుకున్నట్లే ఈ సినిమా మార్చి 27న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా నిర్మాతలే కన్ఫమ్ చేశారు. ''ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో మార్చి 27న జిల్ విడుదల చేస్తున్నాం. మా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను రూఒపొందించాడు. గోపీచంద్ స్టైలిష్ పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఈ సినిమాకు పెద్ద హైలైట్. గోపీచంద్ ఈ తరహాలో ఎప్పుడూ కనిపించలేదు. అతడి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా అయ్యే స్టామినా ఉన్న సినిమా ఇది'' అని నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 20న 'జిల్' సెన్సార్‌కు వెళ్లనుంది. గోపీచంద్ సరసన రాశి ఖన్నా నటించిన ఈ సినిమాకు 'రన్ రాజా రన్' ఫేమ్ జిబ్రాన్ సంగీతాన్నందించాడు.