ఆ హీరో.. విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ

Update: 2023-03-16 09:32 GMT
మలయాళంలో ఈ మధ్యకాలంలో మంచి థ్రిల్లింగ్ కథలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. రెగ్యులర్ పాయింట్ తీసుకున్న అందులో స్క్రీన్ ప్లేతో దర్శకులు మెప్పిస్తున్నారు. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథని నడిపిస్తూ ఆసక్తి కలిగిస్తున్నారు. ఈ కారణంగా మలయాళీ హిట్ మూవీస్ ని ఒటీటీ స్ట్రీమింగ్ సంస్థలు ఇతర భాషలలో కూడా డబ్బింగ్ చేసి ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీ ఇరట్టా.

ఈ సినిమాలో జోజూ జార్జ్ ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలలో డ్యూయల్ రోల్ చేశారు. చనిపోయిన అన్న కేసుని ఇన్వెస్టిగేట్ చేసే తమ్ముడికి తన అన్న ఎంత శాడిస్టిక్ బిహేవియర్ గురించి ఎలా తెలిసింది అనే పాయింట్ తో ఈ కథని ఆవిష్కరించి హిట్ కొట్టారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు మలయాళంతో పాటు ఇతర భాషలలో కూడా డబ్బింగ్ వెర్షన్ గా అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న జోజు జార్జ్ ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

టాలెంటెడ్ యాక్టర్స్ ఎక్కడ ఉన్న కూడా పట్టుకొని టాలీవుడ్ లో మన దర్శకులు పరిచయం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో బోజు జార్జ్ ని నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయిన వైష్ణవ్ తేజ్ ఈ మూవీలో ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే గతంలో మంచు మనోజ్ తో అహం బ్రహ్మస్మి అనే సినిమాని ఈ దర్శకుడు స్టార్ట్ చేశాడు. ఆ మూవీ ఏవో కారణాల వలన ఆగిపోయింది. దీంతో వైష్ణవ్ తేజ్ కి కథ చెప్పి ఒప్పించడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

ఇప్పటికే మలయాళంలో నటుడిగా సూపర్ సక్సెస్ అయ్యి నేషనల్ అవార్డు కూడా అందుకున్న జోజు జార్జ్ ఈ మూవీలో నటిస్తున్నాడు అనే టాక్ బయటకి రావడంతో మూవీపై మరింత అంచనాలు పెరిగాయని చెప్పాలి. మరి అతని పాత్ర ఈ మూవీలో ఎలా ఉంటుంది అనేది చూడాలి.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News