రజినీకాంత్ జోకులు పేలిపోతున్నాయంతే..

Update: 2016-07-22 04:27 GMT
హాలీవుడ్డోళ్లకు సూపర్ మ్యాన్.. హీమ్యాన్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మ్యాన్ లాంటి వీరులు చాలామంది ఉన్నారు. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రజినీకాంత్ ఒక్కడు చాలు. ఆయన మన ప్రేక్షకులకు ఓ సూపర్ హీరో. ఆయన్ని జనాలు ఏ స్థాయిలో హీరోను చేస్తున్నారో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జోకులు కొన్ని చదవండి మీకే అర్థమవుతుంది...

* గ్రహంబెల్ తొలి టెలిఫోన్ కనుగొన్నాడు. కానీ అప్పటికే రజినీకాంత్ దానికి రెండు మిస్డ్ కాల్స్ ఇచ్చాడు.

* న్యూటన్ మీద పడ్డ యాపిల్ ను విసిరింది రజినీకాంతే.

* రజినీకాంత్ ఐదు వేర్వేరు భాషల్లో విజిల్స్ వేయగలడు.

* పుణె నుంచి ఓ వ్యక్తి ముంబయికి ఈ మెయిల్  పంపించాడు. కానీ దాన్ని లోనవాలాలో రజినీ ఆపేశాడు.

* మోనాలిసా ఎందుకలా నవ్వుతోందో రజినీకాంత్ కు మాత్రమే తెలుసు.

* తన గర్ల్ ఫ్రెండ్ తన తప్పును ఒప్పుకునేలా చేయగల ఏకైక వ్యక్తి రజినీకాంతే.

* రజినీకాంత్ ఓ పాకిస్థాన్ టెర్రరిస్టును బ్లూటూత్ ద్వారా కాల్చేశాడు.

* రజినీకాంత్‌ ను ఈ రోజు గన్నుతో కాల్చారు. రేపు బుల్లెట్ ఖననం జరగబోతోంది.

* రజినీకాంత్ పల్స్ ను రిచర్ స్కేల్ ద్వారా కొలుస్తారు.

* రజినీకాంత్ వృత్తలేఖిని ద్వారా సరళరేఖ గీయగలడు.

* రజినీకాంత్ ఇంట్లో మేడమ్ టుస్సాడ్ విగ్రహం ఉంది.

* రజినీకాంత్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ బూస్ట్ ఎనర్జీ.. కాంప్లాన్ ఈజ్ ఎ రజినీకాంత్ బాయ్

* రజినీకాంత్ 100 మీటర్ల రేసులో పాల్గొన్నాడు. ఆయనే విజేత. ఐతే ‘కాంతి’ రెండో స్థానంలో వచ్చిందని ఐన్ స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Tags:    

Similar News