సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గుడిపూడి శ్రీ‌హ‌రి మృతి

Update: 2022-07-05 06:03 GMT
సినీ ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా ఇండ‌స్ట్రీతో పాటు ఇండ‌స్ట్రీతో సంబంధం వున్న సినీ పాత్రికేయులు మృతి చెందుతున్నారు. ఇటీవ‌ల న‌టి మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఊపిరి తిత్తులు పాడైపోవ‌డంతో మృత్యువాత ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక సినీ జ‌ర్న‌లిజానికి సంబంధించిన వారు కూడా ఇటీవ‌ల అనారోగ్య కార‌ణాల వ‌ల్ల అక‌స్మాత్తుగా మృత్యువాత ప‌డుతున్నారు. ఇటీవ‌ల జెమిని శ్రీ‌నివాసరావు అనే యువ జ‌ర్న‌లిస్ట్ హార్ట్ స్ట్రోక్ కార‌ణంగా మృత్యువాత ప‌డ‌టం ప‌లువురిని షాక్ కు గురిచేసింది.

ఈ విషాదాలు మ‌రువ‌క‌ముందే మంగ‌ళ‌వారం ప్ర‌ముఖ సీనియ‌ర్ సినీ జ‌ర్న‌లిస్ట్, సినీ విశ్లేష‌కులు గుడిపూడి శ్రీ‌హ‌రి (88) క‌న్నుమూశారు. అర్థ శ‌తాబ్దం పాటు సినీ విశ్లేష‌కుడిగా, పాత్రికేయుడిగా సేవ‌లందించారు. ఆయ‌న‌కు ఓ కుమారుడు, కుమార్తె వున్నారు. గ‌త కొంత కాలంగా అనారోగ్య కార‌ణాల వ‌ల్ల బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్ లోని త‌న నివాసంలో మంగ‌ళ‌వారం ఉద‌యం తుది శ్వాస విడిచారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఈయ‌న అందించిన రివ్యూల‌కు చాలా మంది స్టార్స్ ప్ర‌త్యేకంగా చూసేవారు.  

గుడిపూడి శ్రీ‌హ‌రి ఈనాడు, ద హిందు, ఫిల్మ్ ఫేర్ వంటి ప్ర‌ముఖ ప‌త్రిక‌ల‌తో ప‌ని చేశారు. దాదాపు 55 ఏళ్ల పాటు సినీ విశ్లేష‌కుడిగా, పాత్రికేయుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎన‌లేని సేవ‌లు అందించారాయ‌న‌. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ అనే పుస్తాకాన్ని కూడా ర‌చించారు. ఇండ‌స్ట్రీలో గుడిపూడి శ్రీ‌హ‌రి రివ్యూలంటే స్టార్స్‌, డైరెక్ట‌ర్స్ కు ప్ర‌త్యేక అభిమానం.  

ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలిసి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో శ్రీ‌హ‌రి భార్య ల‌క్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. అప్ప‌టి నుంచి శ్రీ‌హ‌రి మ‌న‌సింగా బాగా కృంగిపోయారు.

దాంతో ఇంటికే ప‌రిమితం అయిపోయారు. గ‌త వారం ఇంట్లో జారి ప‌డిపోవ‌డంతో తొంటి వెముక విగిరింది. నిమ్స్ లో ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌డంతో కుదుట‌ప‌డ్డారు. కానీ ఆ త‌రువాత ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో మంగ‌ళ‌వారం ఉద‌యం త‌న నివాసంలోనే క‌న్నుమూశారు. గుడిపూడి శ్రీ‌హ‌రి విదేశాల్లో వున్నారు. ఆయ‌న తిరిగి రాగానే అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

గుడిపూడి శ్రీ‌హ‌రికి 2013వ సంవ‌త్స‌రానికి గానూ తెలుగు విశ్వ‌విద్యాల‌యం 'ప‌త్రికా ర‌చ‌న‌'లో కీర్తి పుర‌స్క‌రాన్ని ప్ర‌క‌టించింది. 1986 నుంచి 'ది హిందూ'లో రివ్యూలు రాయ‌డం ప్రారంభించారు గుడిపూడి శ్రీ‌హ‌రి. అప్ప‌టి నుంచి ఎన్నో తెలుగు సినిమాల‌కు రివ్యూలు రాశారు. ఆయ‌న రాసిన రివ్యూల‌న్నింటినీ సుంద‌ర‌య్య విజ్ఞాన క‌ళాపండ‌పానికి అంద‌జేశారు. శ్రీ‌హ‌రి ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ బ్రాడ్ కాస్ట‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న వ్యంగ్యంగా రాసిన 'హ‌రివిల్లు' 25 ఏళ్ల పాటు సుధీర్గంగా సాగింది.
Tags:    

Similar News