సూపర్ స్టార్ స్టైల్ లో జూనియర్ అభివాదం

Update: 2016-05-20 13:36 GMT
ఏదైనా విషయంలో ఒక్కో స్టార్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. కావాలని చేయకపోయినా.. ఒక హీరో మేనరిజమ్ మరో స్టార్ హీరోని గుర్తు చేసిందంటే అది సంచలనమే అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన అభివాదం ఏకంగా ఓ సూపర్ స్టార్ ని గుర్తు చేసేసింది.

మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు యంగ్ టైగర్ ఇంటికి ఉదయాన్నే బోలెడుమంది అభిమానులు చేరుకున్నారు. తన ఫ్యాన్స్ ని నిరుత్సాహపరచకుండా ఎన్టీఆర్ కూడా వాళ్లకు దర్శనమిచ్చాడు. అయితే.. జనాలు ఎక్కువగా ఉండడంతో.. వారికి దగ్గరగా వచ్చే బదులు.. తన ఇంటి మేడపై నుండే అందరికీ హాయ్ చెప్పి పలకరించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ ని చూస్తే.. టక్కున బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ గుర్తుకు రావాల్సిందే.

హాయ్ చెప్పినంత మాత్రాన షారుక్ తో పోల్చాలా అనుకోవచ్చు కానీ.. కుడి చేతిని ప్యాంట్ పాకెట్ లో పెట్టి - ఎడమ చేత్తే పలకరించడం కింగ్ ఖాన్ మేనరిజమ్. దాన్ని ఎన్టీఆర్ కాపీ కొట్టేశాడని అనడం కరెక్ట్ కాదు కానీ.. జస్ట్ ఈ లుక్ చూడగానే ఆ పోలిక గుర్తుకొస్తోందంతే. తన బర్త్ డే సందర్భంగా జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. ఈ నెలాఖర్లో టీజర్ ని.. ఆగస్ట్ 12న మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు.
Tags:    

Similar News