ఈ ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే ఆ ధైర్యం ఉంది : ఎన్టీఆర్‌

Update: 2022-03-17 12:30 GMT
అనీల్ రావిపూడికి ఎన్టీఆర్‌.. రామ్ చరణ్‌ మరియు రాజమౌళిలు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ మొత్తం ఇంటర్వ్యూ నుండి చిన్న చిన్న బిట్ లుగా వీడియోలను కట్‌ చేసి మరీ అభిమానులు షేర్ చేస్తూ ఉన్నారు. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ అభిమానులు వారి వారి హీరోలకు చెందిన వీడియో బిట్‌ లను కట్‌ చేసి వైరల్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యల తాలూకు ఒక వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

రాజమౌళి తో ఎన్టీఆర్‌ అనుబంధం గురించి అనీల్ రావిపూడి ప్రశ్నించిన సమయంలో ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. ఈ ప్రపంచంలో నన్ను నేరుగా విమర్శించే ధైర్యం కేవలం జక్కన్న రాజమౌళికి మరియు నాన్న గారికి మాత్రమే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు తప్ప నా ముందు కు వచ్చి ఏ ఒక్కరు కూడా నన్ను విమర్శించే సాహసం చేయరు అంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. రాజమౌళి నేను ఏదైనా తప్పు చేస్తే వెంటనే అనేస్తాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ మరియు రాజమౌళిలు ఒకరిపై ఒకరు ఈ వీడియోలో ప్రశంసలు కురిపించుకున్నారు. రాజమౌళి పలు విషయాలను ఎన్టీఆర్‌ నుండి నేర్చుకున్నాను అంటూ వ్యాఖ్యలు చేయబోతున్న సమయంలో ఎన్టీఆర్‌ వెంటనే స్పందిస్తూ అస్సలు నిజం కాదు. ఆయన నుండి నేను చాలా నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో రాజమౌళి షూటింగ్‌ సమయంలో ఎంతగా ఇబ్బంది పెట్టాడో కూడా సరదాగా చెప్పుకొచ్చాడు. షూటింగ్‌ సమయంలో చాలా విరక్తి కలిగేది. దాంతో వల్లి అమ్మ వద్దకు వెళ్లి ఏంటమ్మ ఇది అని మొర పెట్టుకునే వాడిని.. ఆమె సర్ది చెప్పినట్లుగానే చెప్పి వెళ్లి ఆ షాట్‌ చేసుకుని రాపో అనేది అంటూ చెప్పుకొచ్చాడు.

రమ గారి వద్దకు వెళ్లినప్పుడు ఆమె మొదట దొంగ సచ్చినోడు అంటూ రాజమౌళిని తిట్టేదట. ఆ తర్వాత ఏం చేస్తాం తప్పుద్దా వెళ్లి ఆ షూట్ ను కంప్లీట్‌ చేయమంటూ ఓదార్చేదట. మొత్తానికి ఇంటర్వ్యూ మొత్తం చాలా సరదాగా.. పలు ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ సాగింది. అందుకే యూట్యూబ్‌ లో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.
Tags:    

Similar News