యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న జనతా గ్యారేజ్ అన్ని హంగులు పూర్తి చేసేసుకుంటోంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. ఒకటి అరా ప్యాచ్ వర్క్స్ మినహాయిస్తే.. షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిందని టాక్. ఆగస్ట్ 12న ఆడియో రిలీజ్ సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ డీటైల్స్ బైటకు రానున్నాయి.
ఇప్పుడు జనతా గ్యారేజ్ కి సంబంధించి రిలీజైన అన్ని పోస్టర్లలోనూ ఎన్టీఆర్ లుక్స్ లో బాగా ఇంటెన్సిటీ కనిపిస్తోంది. చూడగానే ఓ డాన్ టైపులో ఎన్టీఆర్ దర్శనమిస్తున్నాడు. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ చేస్తోంది ఐఐటీ స్టూడెంట్ పాత్ర అనే సంగతి తెలిసిందే. తర్వాత జనతా గ్యారేజ్ లోకి వచ్చి.. అన్ని రకాల రిపేర్లు చేసేస్తుంటాడు. ఇలా ఓ స్టూడెంట్ రౌడీగా మారడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ శివ. రామ్ గోపాల్ వర్మ-నాగార్జున వచ్చిన ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే టైపు స్టోరీ చేస్తున్నాడేమో అంటున్నారు విశ్లేషకులు. బాగా చదువుకునే ఒక యువకుడు.. ఫ్యామిలీ కోసం ఒక లీడర్ తరహాలో మారి సెటిల్మెంటులు చేయడం.. ఒక 'శివ' ఒక 'గాయం' వంటి సినిమాలను గుర్తుకుతెస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో శివ సినిమా తరహాలో చాలా సినిమాలే వచ్చాయి కాని.. వాటిల్లో ఎందులోనూ ఇంటెన్సిటీ మాత్రం కనిపించలేదు. కాని ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' విషయానికొస్తే.. అందులో ఇంటన్సిటీ పాళ్లు కాస్త అధికంగానే ఉన్నాయి. పైగా తారక్ ఒక్కడే కాకుండా సాయికుమార్, మోహన్ లాల్, బెనర్జీ, బ్రహ్మాజీ తదితర సీనియర్ నటులను చూస్తుంటే.. ఈ సినిమా సెటప్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించక మానదు.