టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటివరకు తెరకెక్కిన సినిమాలన్ని సూపర్ హిట్స్ - బ్లాక్ బస్టర్స్ - ఇండస్ట్రీ హిట్స్.. అంటూ రికార్డులు సెట్ చేసాయి. అందుకే రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ మాత్రమే కాదు. దేశం మొత్తం ఎదురుచూసేలా స్టార్డం క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. ఓ దర్శకుడుగా రాజమౌళి టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్ళాడని చెప్పాలి. బాహుబలి సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ బంధనాలను తెంచేసాడు. అప్పటినుండి తదుపరి సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి ఉన్నారు.
అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా 'ఆర్ఆర్ఆర్'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. డీవీవి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. అయితే పీరియడిక్ యాక్షన్ మూవీగా ఆర్ఆర్ఆర్ కథాకథనాలు కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ మల్టీస్టారర్ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా.. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.
అయితే ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో నెలకొనగా.. తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. అయితే ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజిలో ఉండబోతున్నాయని.. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు తమ సీట్లలో కూర్చోలేరు.. అంటూ రేంజిలో సినిమా పై అంచనాలు రెట్టింపు చేసేసాడు. ఈ సినిమాలో అలియాభట్ - ఓలివియా మోరిస్ హీరోయిన్స్. ఈ సినిమా అక్టోబర్ నెలలో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఆర్ఆర్ఆర్ మూవీ సందడి చేయనుందని సమాచారం.