కరోనా కారణంగా ముందస్తు సమాచారం ఏమీ లేకుండా కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించడంతో ఎక్కడున్న వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. కనీసం పక్క ప్రాంతంకు.. పక్క రాష్ట్రంకు వెళ్లే పరిస్థితి లేదు. కొందరు విదేశాల్లో చిక్కుకు పోగా మరికొందరు దేశంలోనే పలు చోట్ల చిక్కుకు పోయారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ కూడా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ముంబయిలో ఉండాల్సిన జునైద్ కొన్ని కారణాల వల్ల పాంచ్ గానీ బంగ్లాలో చిక్కుకు పోయాడు. అక్కడ నుండి బయటకు రాలేక.. అక్కడే ఉండలేక అతడు అవస్థలు పడుతున్నాడు. అమీర్ ఖాన్ కొడుకును అక్కడ నుండి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా కూడా అవి సఫలం కాలేదని అంటున్నారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ సడలించడం లేదా ఎత్తి వేయడం చేస్తే అప్పుడు జునైద్ ముంబయికి వస్తాడనుకుంటే లాక్ డౌన్ ను పొడగించడంతో మళ్లీ టెన్షన్ పడుతున్నారు. మే 3వ తారీకు వరకు జునైద్ పాంచ్ గానీ బంగ్లాలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా సంతానమే జునైద్ మరియు ఇరా. ప్రస్తుతం వీరిద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరా దర్శకత్వంపై ఆసక్తి చూపుతుండగా జునైద్ నటనలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరికి కూడా అమీర్ ఖాన్ నుండి మద్దతు ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.