సినిమా జనాలకు రాజకీయాల మీద ఆసక్తి ఉంటే.. రాజకీయ నాయకులకు సినిమా మీద ఆసక్తి ఉంటుంది. సినిమాలు పేరు తెచ్చుకున్న వాళ్లు రాజకీయాలవైపు చూస్తే.. జకీయాల్లో పేరుమోసిన వాళ్ల బంధువులు సినిమాల్లోకి రావాలని ఆశపడుతుంటారు. వాళ్ల ప్రయత్నాలు ఫలించి ఒకటి.. రెండు సినిమాలు చేసినా అంతటితో తెరమరుగైపోతుంటారు. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు రవితేజ హీరోగా ప్రయత్నించినా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాడు.
ఉత్తరాంధ్రలో ప్రముఖ నాయకుల్లో ఒకరైన బొత్స సత్యనారాయణ అల్లుడి తమ్ముడు రంజిత్ తాజాగా జువ్వ సినిమాతో టాలీవుడ్ కు పరిచయడం అయ్యాడు. దిక్కులు చూడకు రామయ్య సినిమాతో వైవిధ్యమైన సినిమా తీశాడని పేరు తెచ్చుకున్న త్రికోటి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు రూ. 10 కోట్లకు పైగా పెట్టుబడిగా పెట్టారని తెలుస్తోంది. ఈ వారం థియేటర్లలోకొచ్చిన జువ్వ ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి స్వయంగా బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు మొదలెట్టాడు. వీలైనంత వరకు ఈ సినిమా గురించి పాజిటివ్ గా ప్రచారం చేయాలని హైదరాబాద్ లో తనకు తెలిసిన మీడియా సర్కిల్ ద్వారా తెగ రిక్వెస్టు చేస్తున్నాడని తెలుస్తోంది.
జువ్వ సినిమా చిన్నదే అయినా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కానీ ఈ ఎలిమెంట్ కూడా సినిమాకు ఏ మాత్రం ప్లస్సవలేదు. అందుకే బొత్స సత్యనారాయణ మీడియా ద్వారా సినిమాకు హైప్ తేవడానికి ప్రయత్నిస్తున్నారు. జువ్వ సినిమా రిలీజుకు ముందు కూడా ఈ సినిమాపై బజ్ ఏమీరాలేదు. బయ్యర్లు పెద్దగా రాకపోవడంతో బొత్స ఫ్యామిలీకే చెందిన నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేసుకున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.