చిత్రం : ‘జ్యో అచ్యుతానంద’
నటీనటులు: నారా రోహిత్ - నాగశౌర్య - రెజీనా - పావని గంగిరెడ్డి - రాజేశ్వరి - తనికెళ్ల భరణి - కృష్ణచైతన్య - శశాంక్ - సీత తదితరులు
సంగీతం: కళ్యాణ రమణ
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
నిర్మాత: రజని కొర్రపాటి
రచన - దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్
అవసరాల శ్రీనివాస్ మంచి నటుడే కాదు.. మంచి రచయిత.. దర్శకుడు కూడా అని ‘ఊహలు గుసగుసలాడే’తో రుజువైంది. తొలి ప్రయత్నంలోనే ఓ అందమైన.. ఆహ్లాదకరమైన సినిమాను అందించిన అవసరాల.. కొంచెం గ్యాప్ తీసుకుని నారా రోహిత్ - నాగశౌర్య - రెజీనాల ఆసక్తికర కాంబినేషన్లో ‘జ్యో అచ్యుతానంద’ను తెరకెక్కించాడు. టైటిల్ దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ పాజిటివ్ గా కనిపించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి అవసరాల ఈసారి ఎలాంటి అనుభూతిని కలిగించాడో చూద్దాం పదండి.
కథ:
అచ్యుత రామారావు (నారా రోహిత్).. ఆనందవర్ధన్ రావు (నాగశౌర్య) అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి పడదు. ఇక వీళ్లింటి పై పోర్షన్ లోకి జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దెకు దిగాక ఇద్దరి మధ్య గొడవలు మరింత ముదురుతాయి. ఇద్దరూ ఆ అమ్మాయిని ప్రేమిస్తారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరికి వారు తననే ఆ అమ్మాయి ప్రేమిస్తోందన్న భావనలో ఉంటారు. ఐతే ఇద్దరూ కలిసి ఒకేసారి ఆ అమ్మాయికి తమ ప్రేమ గురించి చెబుతారు. మరి జ్యోత్స్న వాళ్లకు ఏం సమాధానం చెప్పింది.. ఆ సమాధానంతో వాళ్ల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి.. చివరికి ఏం జరిగింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఇద్దరు అన్నదమ్ముల మధ్య నిగూఢంగా ఉన్న అనుబంధాన్ని ‘జ్యో అచ్యుతానంద’లో అందంగా.. ప్రభావవంతంగా చూపించాడు అవసరాల. వినోదం పాళ్లు కూడా సరిగానే ఉండేలా చూసుకున్నాడు. అవసరాల మార్కు చమక్కులతో ఓ దశ వరకు వినోదాత్మకంగానే సాగుతుంది ‘జ్యో అచ్యుతానంద’. ఆ తర్వాత ఎమోషనల్ టర్న్ తీసుకుని.. కదిలించే ఓ క్లైమాక్స్ తో చక్కటి అనుభూతిని మిగులుస్తుంది. నరేషన్ స్లోగా ఉండటం సినిమాలో చెప్పుకోదగ్గ కంప్లైంట్. అక్కడక్కడా కొంచెం సాగతీత.. కొన్ని అనవసర సన్నివేశాల్ని మినహాయిస్తే ‘జ్యో అచ్యుతానంద’ ఆహ్లాదకరంగా సాగిపోతుంది.
ఆరంభం నుంచి చివరిదాకా దర్శకుడిలో ఎంత క్లారిటీ.. ఎంత పరిణతి ఉందన్నది ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ప్రేక్షకులు ఈజీగా రిలేట్ చేసుకునే ప్రధాన పాత్రలు.. వాటిని చిత్రించిన తీరు సినిమాకు అతి పెద్ద బలం. ఇక్కడే అవసరాల సగం మార్కులు కొట్టేశాడు. ఇక నటీనటుల చక్కటి అభినయం కూడా ఆ పాత్రలకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా అన్నదమ్ముల పాత్రల్ని అవసరాల ఎంత బాగా తీర్చిదిద్దాడో.. వాటిని అంత బాగా పండించాడు నారా రోహిత్.. నాగశౌర్య. ఈ రెండు పాత్రలే కథనాన్ని నడిపిస్తాయి.
కామెడీ పేరుతో హడావుడి చేయకుండా.. అవసరాల చాలా సింపుల్ గా నవ్వులు పండించిన వైనం ఆకట్టుకుంటుంది. ‘‘మీరు కాల్చే ఒక్కో సిగరెట్ మీ ఆయుష్షును తగ్గించేస్తుందనే భయం లేదా’’ అని ఓ పాత్ర అంటే.. ‘‘ఆ సంగతేమో కానీ.. పీల్చే ఒక్కో దమ్ముకి సిగరెట్ పొడవు తగ్గిపోతుంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది’’ అని మరో పాత్ర సమాధానం చెబుతుంది. అవసరాల చమత్కారం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. సిగరెట్ ముట్టించుకోవడానికి ‘‘మా అమ్మ కర్పూరం అంటించుకోవడానికి అగ్గిపెట్టి ఇమ్మంది’’ అని అబ్బాయి అడిగితే.. ‘‘మా నాన్న కూడా ఇంట్లో పూజ దీంతోనే చేస్తారు’’ అంటూ లైటర్ ఇస్తుంది అమ్మాయి. ఇది అవసరాల సెన్సాఫ్ హ్యూమర్ కు రుజువుగా నిలిచే మరో సీన్. ఇలాంటి చమక్కులతో ప్రథమార్ధాన్ని చాలా సరదాగా నడిపించాడు.
కథను మొదలుపెట్టడానికి వెరైటీ స్క్రీన్ ప్లేను ఎంచుకున్నాడు అవసరాల. రెండు లీడ్ క్యారెక్టర్లు ఎవరి కోణంలో.. ఎవరికి తోచినట్లు వాళ్లు తమ గతం గురించి చెప్పడం.. ఆ తర్వాత వాస్తవంగా ఏం జరిగిందో చూపించడం కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి కథలకు అలాంటి స్క్రీన్ ప్లేను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక్కడే రచయితగా.. దర్శకుడిగా అవసరాల మార్కు కనిపిస్తుంది. చక్కటి సన్నివేశాలకు ఆహ్లాదకరమైన సంగీతం.. ఛాయాగ్రహణం కూడా తోడవడంతో తొలి గంట హాయిగా గడిచిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎమోషనల్ సీన్లోనే కొంచెం హడావుడి కనిపిస్తుంది. అప్పటిదాకా సహజంగా ప్రవర్తించిన పాత్రలు అక్కడ కొంచెం అతిగా స్పందిస్తాయి.
ప్రధానంగా ఎమోషన్స్ మీద నడిచే ద్వితీయార్ధంలో కామెడీ డోస్ తక్కువ కావడం వల్ల కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కూడా లెంగ్తీగా సాగి ఇబ్బంది పెడతాయి. జ్యో పాత్ర ప్రవర్తించే తీరు కూడా ప్రేక్షకుల్ని కొంచెం అయోమయానికి గురి చేస్తుంది. నిశ్చితార్థం సీన్ దగ్గర కథ ట్రాక్ తప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఐతే జ్యో పాత్ర పక్కకు వెళ్లి.. అన్నదమ్ముల మీదికి ఫోకస్ షిఫ్టయ్యాక మళ్లీ ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అవుతారు. క్లైమాక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అన్నదమ్ముల్లో ఒకరిపై ఒకరికి ఉన్న దాగి ఉన్న ప్రేమ బయటికొచ్చే సన్నివేశాల్ని అద్భుతంగా మలిచాడు అవసరాల. చివర్లో వచ్చే ‘హగ్’ సీన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రేక్షకుల్లో కదలిక తెచ్చే సన్నివేశం అది.
‘చివరికి మిగిలేది’ పుస్తకానికి రిలేట్ చేస్తూ సినిమాను ముగించిన తీరు కూడా బాగుంది. క్లైమాక్స్ లో చిన్న అతిథి పాత్రతో నాని మెరిశాడు. ద్వితీయార్ధంలో ఓ దశలో కలిగిన అసహనాన్ని క్లైమాక్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని మిగిల్చి థియేటర్ నుంచి బయటకు పంపిస్తుంది ‘జ్యో అచ్యుతానంద’. ఐతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నుంచి ఆశించే అంశాలేమీ ‘జ్యో అచ్యుతానంద’లో ఉండవు. కథాకథనాలు.. నరేషన్ మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు సూటయ్యేలా ఉంటాయి. మాస్ ఆడియన్స్ ఈ సినిమాతో కనెక్టవడం కష్టమే.
నటీనటులు:
‘జ్యో అచ్యుతానంద’లో నారా రోహిత్.. నాగ శౌర్యల నటన గురించి వేర్వేరుగా మాట్లాడకూడదు. అలాంటి పాత్రలు వాళ్లిద్దరివి. ఇద్దరూ ఆ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. హీరోల మధ్య కెమిస్ట్రీ అంటే ఏమో అనుకున్నాం కానీ.. నిజంగానే వాళ్లిద్దరి జోడీ అదిరిపోయింది. సినిమా మొదలైన కాసేపటికే అక్కడ రోహిత్.. శౌర్య ఉన్న సంగతి మరిచిపోతాం. అచ్యుత్.. ఆనంద్ అనే పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. నిజజీవితంలో అన్నదమ్ముల్లాగే కనిపించారు ఇద్దరూ. అన్నదమ్ముల మధ్య ఉండే ఇగోను.. నిగూఢమైన ప్రేమను వాళ్లిద్దరూ చక్కగా పలికించారు. క్లైమాక్స్ లో.. ముఖ్యంగా హగ్ ఇచ్చుకునే సీన్లో వాళ్లిద్దరి నటన సూపర్బ్. జ్యోత్స్నగా రెజీనా కూడా బాగా చేసింది. కాకపోతే ఆమె పాత్రలో అంతగా నిలకడ కనిపించదు. హీరోల భార్యలుగా పావని.. రాజేశ్వరిలవి పరిమితమైన పాత్రలు. ఉన్నంతలో బాగానే చేశారు. తనికెళ్ల భరణి.. సీత.. కృష్ణచైతన్య.. శశాంక్ పాత్రలకు తగ్గట్లు నటించారు.
సాంకేతికవర్గం:
నటీనటుల్లాగే సాంకేతిక నిపుణులు కూడా అవసరాల ఆలోచనలకు.. అతడి టేస్టుకు తగ్గ పనితనం చూపించారు. కళ్యాణ రమణ సంగీతం సినిమాకు పెద్ద ఆకర్షణ. కథాకథనాల్లో కలిసిపోయే సంగీతాన్నందించాడతను. నేపథ్య సంగీతం చాలా ఆహ్లాదంగా సాగుతుంది. పాటలు కూడా అంతే చక్కగా కుదిరాయి. సినిమాలో కలిసిపోయాయి. వెంకట్.సి.దిలీప్ ఛాయాగ్రహణం కూడా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. చక్కటి ఫీల్ తీసుకొచ్చింది. వారాహి వాళ్ల నిర్మాణ విలువల గురించి చెప్పేదేముంది. తన అభిరుచిని మరోసారి చాటుకున్నారాయన. ఇలాంటి కథలకు ప్రోత్సాహమిస్తున్నందుకు ఆయనకు మరోసారి అభినందనలు చెప్పాలి.
అవసరాల రచయితగా.. దర్శకుడిగా మరోసారి తన ముద్ర చూపించాడు. ఇలాంటి సెన్సిబుల్ డైరెక్టర్స్ అరుదుగా ఉంటారు. తొలి సినిమాలో రొమాన్స్.. ఫన్ పండించడంలో తన ప్రతిభను చాటుకున్న అవసరాల.. ఈసారి ఎమోషన్లను కూడా అంతే బాగా డీల్ చేశాడు. కాకపోతే.. కథనాన్ని ఇంకాస్త వేగంగా నడిపించాల్సింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో స్క్రీన్ ప్లే కొంచెం చెడింది. దర్శకుడిగా కంటే కూడా రచయితగా ఎక్కువ మార్కులు పడతాయి అవసరాలకు. అతను ప్రాసలు.. పంచ్ ల మీద ఆధార పడకుండా సహజమైన మాటలతో నవ్వులు పండించిన తీరు మెప్పిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కటి డైలాగులు రాశాడు. అతడి రచనలో తెలుగుదనం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి.
చివరగా: జ్యో అచ్యుతానంద.. మనసు తడుతుంది ‘నెమ్మదిగా’!!
రేటింగ్- 3.25/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre