కె.రాఘ‌వేంద్ర‌రావు పేరు చివ‌ర B.A గుట్టు ఇదీ

Update: 2022-08-21 01:30 GMT
తెలుగులో వందలాది చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. ప్రతి సినిమా టైటిల్ కార్డ్ లో రాఘవేంద్రరావు పేరు చివర బి.ఎ అనే ట్యాగ్ క‌నిపించ‌డం మ‌నం చూస్తుంటాం.

అలా ఎందుకు వేస్తారు? ఆయ‌న పేరు చివ‌ర‌ బి.ఎ వెన‌క సీక్రెట్ ఏమిటో అంటూ చాలామందికి డౌట్ వచ్చినా స‌రైన‌ సమాధానం లేదు. అయితే త‌న‌ పేరు చివర B.A అని రాయ‌డం వెనుక అసలు కారణాన్ని కె.రాఘవేంద్రరావు ఓ సందర్భంలో ప్రస్తావించారు.

``నువ్వు డైరెక్టర్‌ కాకపోతే ఏమి అయ్యేవాడివి?`` అని ఒక‌ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు ``నేను డైరెక్టర్ ని కాకపోతే కచ్చితంగా డ్రైవర్ నే`` అని అన్నాను. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు. అప్ప‌ట్లో బి.ఎ. చదువుకున్న వారికి ఏ ఉద్యోగం వస్తుంది?  డ్రైవర్ కు ఇచ్చేంత‌ జీతం కూడా ఇవ్వరు.

దర్శకుడిగా మారిన తర్వాత బి.ఎ. రెండు మూడు సినిమాల చివర్లో వేశాం. ఆ సినిమాలు బాగా ఆడాయి. ఆ తర్వాత ఒక సినిమాలో నా పేరు చివర డిగ్రీ పెట్టలేదు. ఆ మూవీ సరిగ్గా ఆడలేదు. అందుకే సెంటిమెంట్ గా భావించి పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కి చెప్పాను`` అని అన్నారు.

నిజానికి అది నా కోరిక కాదు. సెంటిమెంట్ గా అనిపించింది. తదుపరి సినిమా చివరలో నా పేరు బి.ఎ. జోడించాం. త‌ర్వాత హిట్లు వచ్చాయి. దాంతో అది అప్పటి నుంచి సెంటిమెంట్ గా మారింది. నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. చెక్కులు రాయను.. టిక్కెట్లు కొనుగోలు చేయను.. నా ప్రొడక్షన్ మేనేజర్లు నా విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నేను బాగా డ్రైవింగ్ చేస్తాను. దర్శకుడు కాకపోతే డ్రైవర్‌ అయ్యేవాడిని`` అని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.

కె.రాఘ‌వేంద్ర‌రావు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇండ‌స్ట్రీ హిట్లు ఉన్నాయి. మినిమం గ్యారెంటీతో వ‌రుస‌గా డ‌జ‌ను పైగా సినిమాలు ఆడిన సంద‌ర్భాలు రిపీటెడ్ గా ఉన్నాయి. అంత‌టి క్రేజీ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వేరొక‌రు లేరు! అని ఆయ‌న స‌మ‌కాలికులతో మ‌న్న‌న‌లు అందుకున్న గొప్ప ద‌ర్శ‌కుడు ఆయ‌న‌.
Tags:    

Similar News