ఈ కాదలి అచ్చం ఆ సినిమాలా ఉందే

Update: 2017-05-27 04:21 GMT
ఏసియన్ లాంగ్వేజెస్ లో వచ్చే చాలా సినిమాలను చూసి మనోళ్ళు ఉత్తినే ఫ్రీమేక్ చేసేస్తుంటారు. లేదంటే ఆ పాయింట్ తో ఇనస్పయిర్ అయిపోయి దానిని నుండి కొత్త కథను అల్లుకుంటూ ఉంటారు. కాకపోతే ఒకే టైములో అలాంటి కథలు వస్తేనే కాస్త కామెడీగా ఉంటుంది. 'వెన్జియెన్స్' అనే సినిమా ప్రేరణతో దాదాపు ఒకే టైములో ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' గోపిచంద్ 'వాంటెడ్' సినిమాలొచ్చాయి. అంటే ఈ సినిమాల రైటర్లు ఇద్దరూ ఒకే షాపులో సేమ్ డివిడి రెంట్ కు తీసుకుని.. వేరువేరుగా చూసి.. ఇలా కాస్త మార్చేసి కథలుగా తయారు చేసుకున్నారనమాట.

ఇప్పుడు ఈ టాపిక్ అంతా చెప్పడం దేనికీ అంటే.. ఈ మధ్యనే హెబ్బా పటేల్ ఒక ఊపుఊపుతూ 'నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్' అనే సినిమాతో వచ్చింది. ఫుల్లు జోష్ మీదున్న ఈ భామకు బ్రేకులేసి ఒక ఫ్లాపును చేతిలోపెట్టిన ఈ సినిమా కథను చూసుకుంటే.. ఇంట్లో డాడ్ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి.. ఆయనకంటే ముందు తనే ఎవరో ఒకర్ని వెతుక్కుంటే పోలా అని ఫీలై.. ఓ ముగ్గురిని లైన్లో పెడుతుంది. వాళ్లలో మరి ఎవరికి ఓకె చెబుతుంది అనేదే అసలు కథ. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే తరహాలో.. ముగ్గురిని తీసేసి ఇద్దరిని పెడితే.. అది ''కాదలి'' అనే సినిమా అయిపోతుందేమో. ఆ టీజర్ చూస్తే మీకే అర్దమవుతుంది.. ఓసారి చూసిరండి.

అంతేలేండి.. అటు మార్చి ఇటు మార్చి మనోళ్లు అవేకథలను తీస్తుంటారు. ఇప్పుడు అవే సినిమాలను యాజిటీజ్ కూడా తీసేస్తున్నారేమోలే. చూద్దాం మరి ఈ సినిమా దర్శకనిర్మాతలు ఏమంటారో!!


Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News