రజినీకాంత్ కొత్త సినిమా ‘కాలా’ టీజర్ మార్చి 1న రిలీజవుతుందని ముందు ప్రకటించారు. కానీ ముందు రోజు జయేంద్ర సరస్వతి మరణంతో టీజర్ లాంచ్ వాయిదా పడింది. మార్చి 2న ఉదయం 10 గంటలకు టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం చూశారు. కానీ గురువారం రాత్రి ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చడీచప్పుడు లేకుండా టీజర్ ట్విట్టర్లోకి వదిలేశాడు నిర్మాత ధనుష్. అర్ధరాత్రి హఠాత్తుగా టీజర్ లాంచ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎలా బయటికి వచ్చింది కానీ.. ఆల్రెడీ ‘కాలా’ టీజర్ నెట్లో లీకైపోయింది. పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల్లో టీజర్ కనిపించింది.
దీంతో షాక్ తిన్న ధనుష్.. విధి లేక నిన్న అర్ధరాత్రే టీజర్ రిలీజ్ చేసేశాడు. ఉదయం టీజర్ రిలీజ్ చేసినట్లయితే ఆ హంగామానే వేరుగా ఉండేది. ముందుగా అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేవాళ్లు. గంటలో ఇన్ని వ్యూస్.. ఇన్ని లైక్స్.. ఇంత తక్కువ టైంలోనే మిలియన్ మార్క్ అంటూ హంగామా చేసేవాళ్లు. కానీ అదేమీ లేకుండా అర్ధరాత్రి టీజర్ హడావుడిగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ టీజర్ విషయంలో జనాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. రజినీ స్టైల్.. డైలాగుల విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ.. ఇది కొత్తగా ఏమీ అనిపించట్లేదని.. ‘కబాలి’కి కొనసాగింపులా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Full View