సూపర్ స్టార్ టెన్షన్ తప్పింది!!

Update: 2016-05-10 07:43 GMT
సమ్మర్ అంటే సినిమాల విడుదలకు సూపర్ సీజన్. పిల్లలకు సెలవలు ఉండి, ఫ్యామిలీలు థియేటర్లకు దారితీసే ఈ టైంలో మూవీ విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఈ సారి భారీ చిత్రాల హంగామా కారణంగా చిన్న సినిమాల జాడే కనిపించడం లేదు. మరోవైపు పెద్ద సినిమాలకు టెన్షన్ పుట్టించాడు సూపర్ స్టార్ రజినీకాంత్.

తన కబాలి చిత్రాన్ని సమ్మర్ లోనే విడుదల చేస్తాననడంతో.. టాలీవుడ్ చాలా బెంగ పెట్టుకుంది. ఆ మూవీ డేట్ ని బట్టి సెట్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఈ నెల 20న బ్రహ్మోత్సవం విడుదలను ఇప్పటికే ప్రకటించగా.. జూన్ 3న అ..ఆ.. చిత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వీరందరికీ మాత్రం కబాలి టెన్షన్ మెదులుతూనే ఉంది. షూటింగ్ కంప్లీట్ అవడంతో.. రజనీ కూడా రంగంలోకి దిగితే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందని అందరూ భయపడ్డారు. ఇప్పుడీ టెన్షన్స్ ను సూపర్ స్టార్ తప్పించేశారు. కబాలికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో.. రిలీజ్ డేట్ వాయిదా వేసేశారు.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట. రజినీ వెనక్కు వెళ్లిపోవడంతో టాలీవుడ్ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. థియేటర్లు దొరికే అవకాశం ఉండడంతో.. జూన్ మొదటి వారం నుంచి పలు చిన్న చిత్రాల హంగామా కూడా మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Tags:    

Similar News