ఒక హీరో సినిమా హిట్టయితే.. ఆ హీరో నటించే తర్వాతి సినిమా మీద అంచనాలు పెరగడం సహజం. ఐతే ముందు సినిమా ఫ్లాపైనా సరే.. తర్వాతి సినిమా మీద ఆ ప్రభావం ఏమీ కనిపించకుండా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకునేవాళ్లనే స్టార్లు అంటాం. ఇక వరుసగా రెండు డిజాస్టర్లు వచ్చినా.. మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నా.. తన తర్వాతి సినిమాకు గత చిత్రాలకంటే మిన్నగా క్రేజ్ తీసుకురాగల హీరోను సూపర్ స్టార్ అనాలి. ఆయనే రజినీకాంత్.
విక్రమసింహా.. లింగా సినిమాల రిజల్టేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘లింగా’ చేదు అనుభవాన్ని మిగిల్చాక.. రోబో-2కు ముందు ఏదో ఫిల్లింగ్ కోసం ‘కబాలి’ చేస్తున్నట్లుగా కనిపించాడు రజినీ. అట్టకత్తి.. మద్రాస్ లాంటి వైవిధ్యమైన సినిమాలు చేసిన పా.రంజిత్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేస్తాడనగానే అందరూ సందేహంగా చూశారు. అతను రజినీని డీల్ చేయగలడా.. రజినీ మార్కు స్టయిల్.. డైలాగ్స్.. మేనరిజమ్స్ ఇందులో ఉంటాయా.. అసలు ఈ సినిమా ఎలా తయారవుతుందో అని భయపడ్డారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
ఐతే ‘కబాలి’ టీజర్ చూశాక ఆ సందేహాలు..భయాలు అన్నీ పటాపంచలైపోయాయి. నిమిషం నిడివి ఉన్న టీజర్ తో ఓ ఊపు ఊపేశాడు రజినీ. మాఫియా డాన్ పాత్రలో తనదైన శైలిలో అదరగొట్టేశాడు. పైన విగ్గు తప్పిస్తే.. దాదాపుగా తన ఒరిజినల్ అవతారంలోనే కనిపించాడు సూపర్ స్టార్. అయినా ఆయన ఆకర్షణ మంత్రం ఏమాత్రం మిస్సవలేదు. స్టయిల్ అనే పదానికి మళ్లీ తనే సరికొత్త అర్థం చెబుతూ మెస్మరైజ్ చేశాడు సూపర్ స్టార్.
మీరెందుకు మాఫియా డాన్ అయ్యారు అని ప్రశ్నించినపుడు ఆ నవ్వే సీన్ కానీ.. కబాలిరా అంటూ చేతిని ఊపే సీన్ కానీ.. రజినీ అభిమానుల్నే కాదు.. మామూలు ప్రేక్షకుల్ని కూడా ఉర్రూతలూగించేవే. చాలా సింపుల్ గా అనిపిస్తూనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ‘కబాలి’ టీజర్. అందుకే 24 గంటల్లోనే ఒక్క తమిళ టీజర్‌నే 50 లక్షల మందికి పైగా చూశారు. దానికి 2 లక్షలకు పైగా లైకులొచ్చాయి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇది రికార్డు. బాలీవుడ్ సూపర్ స్టార్లకు కూడా సాధ్యం కాని రికార్డులివి. మొత్తానికి సూపర్ స్టార్ సూపర్ స్టారే అని మరోసారి రుజువైంది.