స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుంటే తొలి రోజు మార్నింగ్ షో అయ్యేవరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదిప్పుడు. కొన్ని చోట్ల తెల్లవారు జామునే బెనిఫిట్ షోలు మొదలైపోతాయి. ఇంకొన్ని చోట్ల అర్ధరాత్రే షోలు వేసేస్తారు. ఇక అమెరికాలో అయితే ముందు రోజే ప్రిమియర్ షోలు పడిపోతాయి. దీంతో విడుదలకు ముందు రోజు రాత్రికే సినిమా టాక్ ఏంటన్నది తెలిసిపోతుంది. ఐతే ‘కబాలి’ విషయంలో మరీ ముందుగా షోలు పడిపోతున్నాయి.
భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నానికే ‘కబాలి’ షో మొదలు కాబోతోంది. ‘కబాలి’ మీద జనాల్లో ఉన్న ఆసక్తి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వెంటనే సోషల్ మీడియా ద్వారా సినిమా టాక్ ఏంటన్నది కాసేపటికే తెలిసిపోతుంది. మరుసటి రోజు రెగ్యులర్ షోలు పడే టైంలోపే సినిమా ఫలితమేంటో తేలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ‘కబాలి’ 60 దేశాల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. చాలా దేశాల్లో ముందు రోజే ప్రిమియర్ షోలు పడుతున్నాయి. అమెరికాలో 400కు పైగా స్క్రీన్లలో ‘కబాలి’ రిలీజవుతోంది. ఇది సౌత్ ఇండియన్ సినిమాల్లో రికార్డు. కొన్ని బాలీవుడ్ సినిమాలు మినహాయిస్తే ఏది కూడా అమెరికాలో ఇన్ని థియేటర్లలో రిలీజవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో కలిపి ‘కబాలి’ దాదాపు 5 వేల థియేటర్లలో విడుదలవుతుందని అంచనా.