కబాలి విషయంలో రాజకీయాలు జరిగాయా??

Update: 2016-07-20 17:30 GMT
తెలుగులో సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ''కబాలి'' సినిమాను.. కృష్ణ ప్రసాద్‌.. ప్రవీణ్‌ కుమార్‌.. అనే ఇద్దరు నూతన పంపిణీదారులు.. షుమారు 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని మరీ పంపిణీ చేస్తున్నారనేది టాక్‌. ఈ సందర్భంగా ప్రముఖ పత్రిక డెక్కన్ క్రానికల్ తో వీరు మాట్లాడిన దాని ప్రకారం.. కొందరు దిగ్గజాలు కబాలి తెలుగు రిలీజ్ కు అడ్డుపడుతున్నారని అంటున్నారు.

నిజానికి ఒక పంపిణీదారుడికి రజనీకాంత్‌ యానిమేషన్‌ సినిమా విక్రమసింహా ను డిస్ర్టిబ్యూట్ చేశాక.. దాదాపు 7 కోట్ల లాస్‌ వచ్చిందట. అయితే ఆ నష్టాన్ని బర్తీ చేస్తామని చెప్పిన రజనీకాంత్‌ ఫ్యామిలీ ఇప్పటివరకు స్పందించకపోవడంతో.. ఇప్పుడు ''కబాలి'' సినిమాను ఆపేయాలని.. ఆ సినిమా పంపిణీదారుడు ఇప్పుడు తెలంగాణ డిస్ర్టిబ్యూటర్ల కౌన్సిల్ ను రిక్వెస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ''లింగా'' సినిమా రిలీజును అడ్డుకోలేదు కాని.. ఇప్పుడు ''కబాలి'' సినిమాను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారు?

''లింగా సినిమా అంటే రాక్ లైన్ వెంకటేష్‌ గారిది. ఆయన చాలా పవర్ ఫుల్‌. కాబట్టి ఆయన్ను అడ్డుకోలేదు. మేమంటే చిన్న వాళ్ళం కాబట్టి.. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు'' అంటూ స్పందించారు కబాలి పంపిణీదారులు కృష్ణ ప్రసాద్. వీరు చెప్పింది చూస్తుంటే మరి నిజంగానే కబాలిని ఆపడానికి రాజకీయాలు జరుగుతున్నాయ్ అనుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో.
Tags:    

Similar News