'శాకుంతలం' అసుర మహారాజు ముచ్చట్లు

Update: 2022-01-31 23:30 GMT
సమంత ప్రథాన పాత్రలో గుణుశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న శాకుంతలం సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దిల్‌ రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ పాన్‌ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్‌ లో అసుర మహారాజు పాత్రను ప్రముఖ నటుడు కబీర్ దుహన్ సింగ్ చేశాడు. సినిమాలో అత్యంత కీలకమైన ఆ పాత్ర కోసం తాను పడ్డ కష్టం గురించి.. ఆ పాత్ర గురించి తాజా ఇంటర్వ్యూలో కబీర్ దుహన్ సింగ్ చెప్పుకొచ్చాడు. దాదాపు పది కేజీలకు పైగా బరువు ఉండే కిరీటం ను ధరించి.. చాలా బరువైన నగలు ఒంటిపై ధరించి కత్తి యుద్దం చేయడం అంటే చాలా పెద్ద రిస్క్ గా అనిపించేది. కాని సినిమా లో పాత్ర వెయిట్‌ ఎక్కువగా ఉంటుంది కనుక అంత కష్టం పడాల్సి వచ్చిందన్నాడు.

గుణశేఖర్ గారి దర్శకత్వంలో చేసిన ఈ శాకుంతలం సినిమా తనకు ఒక ల్యాండ్ మార్క్ సినిమా గా మిగులుతుందని కబీర్ దుహన్ సింగ్ చెప్పుకొచ్చాడు. సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఆయన రివీల్‌ చేయడం జరిగింది. సినిమాలో సమంత పాత్ర తో పాటు దేవ్‌ మోహన్‌ పాత్రలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. షూటింగ్ చాలా సరదాగా సందడిగా సాగి పోయింది. ప్రతి ఒక్కరితో కూడా అద్బుతమైన ఔట్ పుట్‌ ను దర్శకుడు గుణశేఖర్ తీసుకున్నాడంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం నేను వర్క్‌ చేసిన ప్రతి రోజు కూడా చాలా మెమరబుల్‌ గా మిగిలి పోయింది. సినిమా విడుదల తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మంచి ఫీల్‌ ను ఇస్తుందని చెప్పుకొచ్చాడు.

శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా వారాలు అవుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. పౌరాణిక నేపథ్యం సినిమా కనుక కాస్త ఎక్కువగానే వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుంది. కాని మరీ ఇంత కాలం వీఎఫ్ఎక్స్ వర్క్‌ ఉంటుందా అంటూ కొందరు సినిమా ఇంకా ఎప్పుడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. సమ్మర్ లో సినిమా విడుదల చేయాలని సోషల్‌ మీడియా ద్వారా సమంత అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేమికులు కూడా కోరుకుంటున్నారు. మరి గుణశేఖర్‌ ఎప్పుడు ఈ సినిమా విడుదల చేస్తాడు అనేది చూడాలి. గుణశేఖర్ ఈ సినిమా ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు. రుద్రమదేవి తర్వాత ఆయన నుండి రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దిల్‌ రాజు చాలా నమ్మకంతో ఈ సినిమాను సమర్పించేందుకు ముందుకు వచ్చాడు. ఆయన చేరికతో శాకుంతంల వెయిట్ పెరిగింది అనడంలో సందేహం లేదు. ఈ శాకుంతలం ను ఈ ఏడాదిలో చూస్తామా లేదా అనేది గుణశేఖర్‌ నుండి ఏదో ఒక క్లారిటీ వచ్చే వరకు స్పష్టత లేదు.
Tags:    

Similar News