బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ... ఓ వారం పది రోజులుగా అస్సలు ఎక్కడా కనిపించడం లేదు. విషయం ఏదైనా... అది తనకు సంబంధించినది అయినా... అసలు తనకేమాత్రం సంబంధం లేనిదైనా... దానిని కెలికేసి... విమర్శలు కొని తెచ్చుకుని... మొత్తం సోషల్ మీడియానే కాకుండా యావత్తు తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వర్మ... సడన్ గా సైలెంట్ ఎందుకయ్యారన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తానేమీ సైలెంట్ కాలేదని, కాస్తంత గ్యాప్ మాత్రమే ఇచ్చానంటూ వర్మ మరోమారు సోషల్ మీడియా వేదికగానే నేటి ఉదయం పెను సంచలనం రేపారు. ఈ మేరకు కాసేపటి క్రితం ఫేస్ బుక్ వేదికగా వర్మ ఓ సంచలనాత్మక పోస్ట్ పెట్టారు.
ఇప్పటికే పలు అంశాలపై వర్మ చేసిన కామెంట్లు - విసిరిన సెటైర్లు పెను కలకలం రేపిన నేపథ్యంలో... తాజాగా రాయలసీమ రక్తపాతంపై అది కూడా ఆ రీజియన్ లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్లపై వర్మ సంధించిన ఈ కామెంట్ ఎంత పెద్ద చర్చకు తెర లేపుతుందో చూడాలి. అయినా వర్మ పోస్ట్ చేసిన విషయం ఏమిటంటే... గతంలో *గన్స్ అండ్ థైస్* పేరిట ఆయన ఓ వెబ్ సిరీస్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ వర్మ అనుకున్న దానికంటే కూడా కాస్తంత ఎక్కువే సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఆ వెబ్ సిరీస్ నే ఇప్పుడు ప్రస్తావించిన వర్మ... గన్స్ అండ్ థైస్ మాదిరే ఇప్పుడు *కడప* పేరిట రాయలసీమ రెడ్లకు సంబంధించిన సిరీస్ ను విడుదల చేస్తానని ప్రకటించేశారు.
అయినా రాయలసీమలో పారుతున్న రక్తపుటేరుల గురించి వర్మ గతంలో రక్తచరిత్ర పేరిట సినిమా తీశారు కదా. అది కూడా రెండు భాగాలుగా విడుదలైంది కదా అంటారా? అది నిజమే గానీ... ఈ సారి వర్మ మొత్తం రాయలసీమలోని సామాజిక వర్గాలను ప్రస్తావించలేదు. కేవలం ఆ ప్రాంతంలోని బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి వర్గం గురించి మాత్రమే ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీ విపక్ష నేతగా - వైసీపీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే ప్రాంతానికి - అదే సామాజిక వర్గానికి చెందిన వారేనన్న విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు తాజా స్టేట్ మెంట్ తో వర్మ...జగన్ ను టార్గెట్ చేస్తున్నారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఈ అనుమానాలన్నీ నిజమేనన్నట్లుగా సదరు సిరీస్ కు జగన్ సొంత జిల్లా అయిన *కడప* పేరును వర్మ ఎంచుకున్నారు. రాయలసీమలోని రెడ్లు ఆ ప్రాంతంలో పారిస్తున్న నెత్తుటేరులను, ప్రత్యేకించి రాజకీయాల్లో వారు వ్యవహరిస్తున్న తీరును - రాజకీయ లబ్ధి కోసం వారు ఎంచుకుంటున్న రక్తపుటేరులను ఈ సిరీస్ లో చూపిస్టానంటూ వర్మ కాస్తంత డేర్ స్టేట్ మెంటే ఇచ్చేశారు. మరి ఈ సిరీస్ వర్మకు ఇబ్బందులు తెస్తుందో - లేదంటే గతంలో మాదిరిగా వర్మ మరో హిట్ సాధిస్తారో చూడాలి.