అందుకోసం చంద‌మామ ఎదురు డ‌బ్బులిచ్చేద‌ట‌

Update: 2017-04-04 05:53 GMT
అందం.. అంత‌కు మించిన ఆత్మ‌విశ్వాసం కాస్త రేర్ కాంబినేష‌న్ అని చెప్పాలి. ఈ రెండూ ట‌న్నుల‌.. ట‌న్నుల కొద్దీ పుష్క‌లంగా ఉన్న చ‌క్క‌ని చుక్క చంద‌మామ‌. ఏళ్ల‌కు ఏళ్లు గ్లామ‌ర్ ప్ర‌పంచంలో నెట్టుకు రావ‌టం చిన్న విష‌యం కాదు. ఈ విష‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ టాలెంటే వేర‌ని చెప్పాలి. అమ్మ‌డి య‌వ్వారం అయిపోయిందిలే అన్న ప్ర‌తిసారీ త‌న స‌త్తా చాటేస్తూ.. స‌రికొత్త అందాల‌తో ఉక్కిరిబిక్కిరి చేయ‌టం కాజ‌ల్ కే చెల్లుతుంది.

సంక్రాంతికి వ‌చ్చిన మెగాస్టార్ ఖైదీ నంబ‌రు 150లో త‌ళుక్కుమ‌న్న భామ‌.. మ‌రో నాలుగైదేళ్లు బండి లాగించేస్తాన‌న్న సంకేతాన్ని ఇచ్చేసింది. మీడియాతో ఫ్రెండ్లీగా ఉండే త‌త్త్వంతో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వార్త‌ల్ని కాస్త భారీగా క‌నిపించేలా ప్లాన్ చేసే ఈ అమ్ముడు.. త‌న చిన్న‌నాటి ముచ్చ‌ట్ల‌ను అడిగినంత‌నే చెప్పుకొస్తుంది.

తాజాగా అలాంటి ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట ఒక‌టి చెప్పుకొచ్చింది. చిన్న‌ప్ప‌టి నుంచి హుషారుగా.. అల్ల‌రిచిల్ల‌రి అమ్మాయిలా ఉండే అల‌వాటు ఉండేద‌న్న ఆమె.. స్కూల్ రోజుల్లో త‌న జుట్ట‌ను బోయ్ క‌ట్ చేయించేవార‌ని.. దీంతో.. చూసేందుకు అబ్బాయిలా ఉండేదానిన‌ని గ‌తాన్ని గుర్తు చేసుకుంది. ఒక‌వేళ గ్లామ‌ర్ ఫీల్డ్ కి రాకుండా ఉంటే.. తాను క‌చ్ఛితంగా హెయిర్ స్టైలిస్ట్‌ ని అయ్యేదానిన‌ని చెప్పిన‌ కాజ‌ల్‌.. త‌న చెల్లి నిషాకు పెద్ద జ‌ట్టు ఉండేద‌ని.. తామిద్ద‌రం క‌లిస్తే చాలు.. ర‌క‌ర‌కాల ప్ర‌యోగాల్ని నిషా జుట్టుతో చేసేదానిన‌ని చెప్పింది.

మొద‌ట్లో తానేం చేసినా నిషా ఓకే అనేద‌ని.. త‌ర్వాత మాత్రం.. నో అనేద‌న్న కాజ‌ల్‌.. నిషా జ‌ట్టు మీద ప్ర‌యోగాలు చేయ‌టానికి ఆమెకు రూ.20.. రూ.50 ఎదురు డ‌బ్బులు ఇచ్చి మ‌రీ.. ఒప్పించేదానిని చెప్పింది. త‌న‌కు న‌చ్చిన ప‌ని చేయ‌టానికి.. అవ‌స‌ర‌మైతే ఎదురు డబ్బులిచ్చి మ‌రీ తాను అనుకున్న ప‌నిని చేసే కొత్త యాంగిల్ ఆస‌క్తిక‌రంగా అనిపించట్లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News